రెండు రోజులుగా పనిచేయని లిఫ్ట్.. తెరిచి చూస్తే షాక్ !!
కేరళ లో ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆ వ్యక్తి ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. అయితే, అదృష్టం బాగుండి రెండు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉళ్లూరు ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల రవీంద్రన్ నాయర్ గత శనివారం మెడికల్ చెకప్ కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లారు. అవుట్ పేషెంట్ బ్లాక్‌లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు.
కేరళ లో ఓ వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన ఆ వ్యక్తి ప్రమాదవశాత్తూ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. అయితే, అదృష్టం బాగుండి రెండు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉళ్లూరు ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల రవీంద్రన్ నాయర్ గత శనివారం మెడికల్ చెకప్ కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లారు. అవుట్ పేషెంట్ బ్లాక్‌లోని మొదటి అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. సరిగ్గా అదే సమయంలో ఎలివేటర్‌లో సమస్య తలెత్తి లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. లిఫ్ట్ బలంగా ఊగడంతో రవీంద్రన్ ఫోన్ కిందపడి పగిలింది. దీంతో తాను చిక్కుకుపోయినట్లు ఎవరికీ చెప్పే అవకాశం లేకుండాపోయింది. లోపలి నుంచి సాయం కోసం అరిచినా ఎవరికీ వినబడకపోవడంతో అతడు ఇరుక్కుపోయిన సంగతి ఎవరికీ తెలియలేదు. సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్ రొటీన్ వర్క్ కోసం ఆసుపత్రికి వచ్చారు. అప్పుడు అది పనిచేయడం లేదని గుర్తించి రిపేర్ చేసి లిఫ్ట్ డోర్ తెరవగా అందులో రవీంద్రన్ స్పృహతప్పి కన్పించారు. వెంటనే అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. లిఫ్ట్ పని చేయని విషయాన్ని కూడా ఆసుపత్రి సిబ్బంది గుర్తించలేదని సమాచారం. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, రవీంద్రన్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆదివారం రాత్రి ఆయన కుటుంబం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మహిళలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగితే ఏమవుతుందో తెలుసా ??
10 ఉద్యోగాలకు పోటెత్తిన 1800 ఆశావాహులు
నిద్రపోదామని మంచంపై వాలిన రైతు.. ఎదురుగా సెల్ఫ్‌లో ఉన్నది చూసి షాక్