లో దుస్తులు విప్పించిన సిబ్బంది.. నీట్ పరీక్షలో అమానుషం
కేరళలోని కొల్లంలో దారుణం జరిగింది. నీట్ ఎగ్జామ్ సెంటర్‌లో విద్యార్ధినులను తనిఖీల పేరుతో లో దుస్తులు విప్పించడంపై రగడ రాజుకుంది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం సీరియస్ అయ్యింది .
కేరళలోని కొల్లంలో దారుణం జరిగింది. నీట్ ఎగ్జామ్ సెంటర్‌లో విద్యార్ధినులను తనిఖీల పేరుతో లో దుస్తులు విప్పించడంపై రగడ రాజుకుంది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం సీరియస్ అయ్యింది . ఇన్విజిలేటర్‌పై పోలీసులు, ఇప్పటికే కేసు నమోదు చేశారు. కొల్లం ఆయూర్‌లోని మార్తోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిలను లో దుస్తులను తొలగించమని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో 100 మందికిపైగా బాలికలను తమ లో దుస్తులు తొలగించి పరీక్షరాసినట్టు తెలిసింది. దీనివల్ల తాము మానసికంగా ఒత్తిడికి గురయ్యాయమని బాలికలు ఆవేదన వ్యక్తంచేశారు. కాగా.. శూరనాద్‌కు చెందిన బాలిక ఈ ఘటనపై తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనతో చాలా మంది బాలికలు ఏడ్చారని.. తమకు ఎదురైన వేధింపుల గురించి పోలీసులకు తెలిపింది. దీంతో బాలికలంతా లో దుస్తులను విప్పి ఓ గదిలో పడేసినట్లు విద్యార్థినులు తెలిపారు. ఈ ఘటన తర్వాత తాము తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని ఆందోళన వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎక్కి ఎక్కి ఏడ్చిన పోలీస్ ఆఫీసర్ !! అసలు విషయం తెలిస్తే తెగ నవ్వుకుంటారు !!
వర్షాకాలంలో చుండ్రు బాగా వేధిస్తోందా ?? సింపుల్‌గా ఇలా వదిలించుకోండి
పోలీసుల వినూత్న ఆలోచన.. సినిమా డైలాగులు, మీమ్స్‌తో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన
Ananya Panday: పాపకు ఇలాంటివి 1stటైం అనుకుంటా..ఓ.. ఎగ్జైట్ అయిపోతుందిగా
Vijay Deverakonda: ‘వీడిలాంటోడు ఇంకోడుండడు..’ యూబ్యూబ్‌ని రఫ్ఫాడిస్తున్న రౌడీ