Afra Emotional Story: తమ్ముడికి చికిత్స కోసం 3 రోజుల్లో రూ. 47 కోట్లు సేకరించింది చివరకు అదే వ్యాధితో ఆమె మరణించింది..

|

Aug 15, 2022 | 9:16 PM

కేరళకు చెందిన 16 ఏళ్ల ఆ టీనేజ్ యువతి ఆఫ్రాకు నాలుగేళ్ల వయసునుంచే స్పైనల్ మస్క్యూలర్ అట్రఫీ(spinal muscular atrophy ) అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. సరిగ్గా నడవలేదు, కూర్చోలేదు..


కేరళకు చెందిన 16 ఏళ్ల ఆ టీనేజ్ యువతి ఆఫ్రాకు నాలుగేళ్ల వయసునుంచే స్పైనల్ మస్క్యూలర్ అట్రఫీ(spinal muscular atrophy ) అనే అరుదైన జన్యు వ్యాధితో బాధపడుతోంది. సరిగ్గా నడవలేదు, కూర్చోలేదు.. మెడ కూడా తిన్నగా ఉండదు. కండరాలు కూడా సహకరించవు. ఆమెతోపాటే ఆ వ్యాధికూడా పెరుగుతూ వచ్చింది. ఆమెకు చికిత్స చేయించడానికి తల్లిదండ్రులు ఎంతో శ్రమపడ్డారు. కానీ పరిస్థితి చేయి దాటిపోయింది. ఈ క్రమంలోనే ఆ యువతి తమ్ముడికి కూడా 18 నెలల వయస్సులో అదే వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో తల్లిదండ్రులు మరింత కుంగిపోయారు. ఈ వ్యాధికి జోల్జెన్‌స్మా అనే ఓ మెడిసిన్ ఉంది. ఈ మెడిసిన్‌ ఒక్క డోస్ ధర దాదాపు 17 కోట్ల 50 లక్షలు. దీన్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. అది కూడా 2 ఏళ్లు నిండకముందు మెడిసిన్ ఇస్తే ఫలితం కనిపించవచ్చు. తన బాధను తన తమ్ముడు అనుభవించకూడదనుకుంది ఆఫ్రా. ఇలాంటి ప్రమాదరక రేర్ డిసీజస్ విషయంలో క్రౌడ్ ఫండింగ్ చేసేందుకు ఇండియన్ గరర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఆ దిశగా ప్రయత్నం చేయగా కొన్ని లక్షలు సమకూరాయి. కానీ అవి సరిపోవు. ఇంకా చాలా కావాలి. ఈ క్రమంలోనే తమ చుట్టాలలోని ఓ వ్యక్తి సాయంతో ఓ వీడియో ఒక వీడియో షూట్ చేసింది. 2021లో తన బాధను చెప్పి.. తన తమ్ముడికి ఆ నరకం చూడకుండా అందరూ సాయపడాలని కోరింది.

సోషల్ మీడియాలో విసృతంగా వైరల్‌ అయిన ఆ వీడియో నెటిజన్ల మనసును కదిలించింది.. మానవత్వం ఉన్న మనుషులు అందరూ స్పందించారు. ఏకంగా 3 రోజుల్లో 47కోట్ల 68 లక్షలు డబ్బు వచ్చింది. ఇంకా డబ్బు వస్తూనే ఉండటంతో.. మనీ సెండ్ చేయడం ఆపాలని ఆమె కోరారు. సమకూరిన డబ్బుతో ముహమ్మద్‌కు ట్రీట్మెంట్ చేశారు. మిగిలిన డబ్బును అదే వ్యాధితో బాధపడుతున్న మరో ఇద్దరు చిన్నారుల కోసం ఖర్చు చేశారు. మిగిలిన మొత్తాన్ని కేరళ గవర్నమెంట్‌కు ఇచ్చేశారు. అలా ఆఫ్రా యూట్యూబ్‌లో ఫేమస్ అయ్యారు. పలు అకేషన్స్‌కు సంబంధించిన వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పెట్టేవారు. ఈ క్రమంలోనే ఆఫ్రా ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చింది. ఆగస్టు 1న పరిస్థితి విషమించి ఆమె కన్నుమూసింది. అఫ్రా మరణ వార్త తెలియగానే నెటిజన్లు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. కాగా ప్రజంట్ 2 ఏళ్ల వయసున్న ఆఫ్రా సోదరుడి ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు పేరెంట్స్ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girl letter to Modi: పెన్సిల్‌ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?

Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

Follow us on