ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
రోజు రోజుకూ పెరుగుతునన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దాంతో చాలా మంది బైకులు, కార్లను బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు.
రోజు రోజుకూ పెరుగుతునన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దాంతో చాలా మంది బైకులు, కార్లను బయటకు తీయాలంటేనే భయపడుతున్నారు. కొందరు ఇంటికే పరిమితం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొందామంటే.. ఎక్కడ పేలిపోతాయో అని భయం. ఈ క్రమంలోనే కాశ్మీర్‌కు చెందిన ఓ టీచర్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కాశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి సౌరశక్తితో నడిచే కారును తయారు చేశారు. శ్రీనగర్‌లోని సనత్ నగర్‌కు చెందిన బిలాల్ అహ్మద్ పదకొండేళ్లు శ్రమపడి తన కలల కారును సృష్టించారు. ఈ లెక్కల మాస్టారుకి కార్లంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ విధానంపై అధ్యయం చేసి చివరకు సోలార్ కారును తయారు చేశారు. కారు బ్యానెట్, కిటికీలు, వెనక అద్దంపై సోలార్ ప్యానెళ్లను అమర్చారు బిలాల్ అహ్మద్. కారు డిజైన్ కూడా చాలా బాగుంది. డోర్స్ కూడా డిఫెంరెంట్‌గా ఉన్నాయి. అంతేకాదు రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో