CM Cries video: వెక్కి వెక్కి ఏడ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Updated on: Jun 20, 2022 | 5:12 PM

777 చార్లీ అనే సినిమా ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈ సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంతే ఏడ్చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.


777 చార్లీ అనే సినిమా ఇప్పుడు అందరినీ కంటతడిపెట్టిస్తోంది. ఈ సినిమా చూసి ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంతే ఏడ్చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై 777 చార్లీ సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సినిమాలో పెంపుడు కుక్కతో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని చూపించారు. అయితే సీఎం బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. అందరి ముందే వెక్కివెక్కి ఏడ్చేశారు. సోషల్ మీడియాలో ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. పెంపుడు కుక్కతో అనుబంధాన్ని చాటే.. ఆ సినిమా చూస్తూ ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యారు.సినిమా చూసిన అనంతరం సీఎం బొమ్మై మాట్లాడుతూ కుక్కల గురించి చాలా సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని చాలా గొప్పగా చూపించారని కొనియారు. కుక్క తన భావోద్వేగాలను కండ్ల ద్వారా వ్యక్తపరుస్తుంది. సినిమా చాలా బాగుంది.. అందరూ చూడదగిన సినిమా అన్నారు. కుక్కల ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ. ఇది స్వచ్ఛమైన ప్రేమ అని అన్నారు.కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై స్వతహాగా కుక్కల ప్రేమికుడు. గతేడాది తన పెంపుడు కుక్క చనిపోవడంతో ఆయన చాలా బాధపడ్డారు. పెంపుడు కుక్క మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన బోరున విలపిస్తున్న ఫోటోలు అప్పట్లోనూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Unburnable Book: ఈ పుస్తకం ఓ అద్భుతం… మంటల్లో వేసినా కాలిపోదు.. చెక్కుచెదరదు..!

Viral Video: వరుడు లేని పెళ్లి.. తనను తానే వివాహం చేసుకున్న క్షమా.! వీడియో చుస్తే ఫ్యూజులు అవుటే..

Cris Gaera: బ్రెజిల్‌ మోడల్‌కి బంపర్‌ ఆఫర్‌.. రూ. 38లక్షలు ఇచ్చి అలా అడిగాడు..

Published on: Jun 20, 2022 05:12 PM