Japan: ప్రయోగించిన క్షణాల్లోనే గాల్లో పేలిపోయిన జపాన్ రాకెట్.! వీడియో.
జపాన్ చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విఫలమైంది. దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలిపోవడంతో గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చూట్టూ ఉన్న పర్వతం పై పడ్డాయి. దీంతో తక్షణమే అక్కడ ఉన్న నీటి స్ప్రింక్లర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. మరోవైపు పేలుడు ఫలితంగా లాంచ్ ప్యాడ్ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది.
జపాన్ చేపట్టిన తొలి ప్రైవేటు రాకెట్ ప్రయోగం విఫలమైంది. దాదాపు 60 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగికి ఎగిరింది. కానీ, కొన్ని క్షణాల్లోనే ఇది పేలిపోవడంతో గాల్లోనే అగ్నిగోళంలా మారిపోయింది. దీని శకలాలు చూట్టూ ఉన్న పర్వతం పై పడ్డాయి. దీంతో తక్షణమే అక్కడ ఉన్న నీటి స్ప్రింక్లర్లు పనిచేయడం మొదలుపెట్టాయి. మరోవైపు పేలుడు ఫలితంగా లాంచ్ ప్యాడ్ ఏరియా మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. వాస్తవానికి ప్రయోగించిన 51 నిమిషాల్లోనే ఈ రాకెట్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చాల్సి ఉంది. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ లాంచ్ ప్యాడ్‌లో చోటు చేసుకుంది. టోక్యోకు చెందిన స్పేస్ వన్ సంస్థ ఈ రాకెట్‌ను నిర్మించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. ఆ దేశంలో శాటిలైట్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేటు సంస్థగా ఇది రికార్డు సృష్టించేది. ఈ ప్రమాదంపై ఆ కంపెనీ స్పందిస్తూ కైరోస్ రాకెట్ లాంచింగ్ ప్రక్రియ సజావుగానే సాగింది కానీ, ప్రయోగాన్ని మధ్యలోనే ఆపేసేందుకు చర్యలు తీసుకొన్నట్లు తెలిపింది. ఆ నిర్ణయానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఉపగ్రహ ప్రయోగ మార్కెట్లోకి అడుగుపెట్టాలని భావించిన జపాన్..
తాజా వైఫల్యంతో కొంత నిరాశ చెందింది. ప్రస్తుతం కక్ష్యలో ఉన్న నిఘా ఉపగ్రహాల్లో సమస్యలు తలెత్తితే వెంటనో మరోదానిని నింగిలోకి పంపే ప్రక్రియను ఈ ప్రయోగంలో విశ్లేషించాలనుకొంది. రాకెట్ వైఫల్యాలు జపాన్‌కు కొత్తకాదు. గతేడాది ఎస్పోలాన్ ఎస్ రాకెట్ కూడా ప్రయోగించిన 50 సెకన్లలో పేలిపోయింది. మార్చిలో హెచ్3 రాకెట్ కూడా పేలిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మళ్లీ అదే శ్రేణి రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. హెచ్3.. స్పేసెక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌కు పోటీగా భావిస్తున్నారు. చంద్రుడిపైకి ఒక్కరోజులో వస్తువులను పంపించే సామర్థ్యాన్ని సంతరించుకొనేలా దీనిని నిర్మిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.