ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు

Updated on: Dec 27, 2025 | 7:58 PM

జపాన్ దేశం ఊబకాయాన్ని నియంత్రించేందుకు 'మెటాబో చట్టం' అమలు చేస్తోంది. 40-74 సంవత్సరాల వయసు వారికి వార్షిక నడుము కొలతలు తప్పనిసరి. ప్రమాణాలను మించిన వారికి వైద్య సలహాలు, వ్యాయామ ప్రణాళికలు సూచిస్తారు. లక్ష్యాలు సాధించని వారికి, కంపెనీలకు జరిమానాలు విధిస్తారు. జీవనశైలి వ్యాధులను నివారించడం, ప్రజారోగ్యం మెరుగుపరచడం ఈ చట్టం ప్రధాన లక్ష్యం.

ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగా ఊబకాయంతో బాధపడుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్‌, ఫాస్ట్‌ ఫుడ్, అధిక కేలరీలుండే స్నాక్స్, షుగరీ డ్రింక్స్‌ వాడకం, శారీరక శ్రమ తగ్గడం ఊబకాయానికి ప్రధాన కారణం. అయితే ఊబకాయంపై పోరు కోసం జపాన్‌లో ఓ చట్టాన్ని అమలు చేస్తోంది. తమ దేశంలో ఊబకాయుల కోసం జపాన్.. మెటాబో అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం, 40–74 సంవత్సరాల మధ్య ఉన్న వ్యక్తులు పొట్ట చుట్టూ కొలతలను ఏటా చెక్ చేయించుకోవాలి. పురుషుల నడుము 85 సెం.మీ, మహిళల నడుము 90 సెం.మీ దాటితే ఆ వ్యక్తి వెంటనే హెల్త్ కౌన్సిలింగ్ తీసుకోవాలి. అక్కడి వైద్యులు ఇచ్చే డైట్, వ్యాయామ పద్దతులు పాటించి నడుము సైజు తగ్గించుకోవాలి. వైద్యులు ఇచ్చిన లక్ష్యాలను అందుకోలేకపోతే వారికి భారీ జరిమానాలు వేస్తారు. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, టైప్‌–2 డయాబెటిస్, వివిధ కేన్సర్లు, మూత్రపిండాల సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులకు స్థూలకాయం కారణమవుతోంది. మెటబో చట్టం ప్రకారం 40 నుంచి 74 సంవత్సరాల మధ్య వయస్సు గల పౌరులందరికీ ఏటా ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు చేయిస్తుంది. సమస్య తీవ్రం కాకముందే ఆరోగ్య ప్రమాదాలను గుర్తించి హెచ్చరిస్తుంది. జపాన్‌ ప్రభుత్వ లక్ష్యం పౌరులను శిక్షించడం కాదు. జీవనశైలి సంబంధిత వ్యాధులు తీవ్రం కాకముందే వాటిని నివారించడం. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యం. ఉద్యోగులు లేదా నివాసితుల నడుము చుట్టుకొలతలు తగ్గించే బాధ్యత కంపెనీలు, స్థానిక ప్రభుత్వ శాఖలదే. లక్ష్యాలను చేరుకోలేకపోతే కంపెనీలు లేదా స్థానిక ప్రభుత్వ శాఖలు భారీ జరిమానా చెల్లించాల్సిందే.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు

రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి

అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే

Bad Girl Review: కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ