తలకు హెల్మెట్ వేసుకుంటేనే ఆఫీస్‌కి ఎంట్రీ !!
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండటంతో ఆ పెచ్చులు నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరువుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని పని చేస్తున్నారు. 2016లో బీర్‌పూర్ మండలం ఏర్పడిన నాటి నుంచీ ఎంపీడీఓ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది.
జగిత్యాల జిల్లా బీర్‌పూర్ ఎంపీడీఓ కార్యాలయం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం పెచ్చులూడిపోతుండటంతో ఆ పెచ్చులు నెత్తిమీద ఏదైనా పడొచ్చన్న భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరువుతున్నారు. హెల్మెట్లు లేని వారు కార్యాలయం వెలుపలే టేబుళ్లు వేసుకుని పని చేస్తున్నారు. 2016లో బీర్‌పూర్ మండలం ఏర్పడిన నాటి నుంచీ ఎంపీడీఓ కార్యాలయం అద్దె భవనంలోనే కొనసాగుతోంది. భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఏడాది నుంచి పెచ్చులూడటం ప్రారంభించింది. గతేడాది ఎంపీడీఓ మల్లారెడ్డి కూర్చుని ఉండగా ఆయన టేబుల్‌పై పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అప్పటి అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని మార్చాలని ఆదేశించారు. కానీ, అమలుకు నోచుకోలేదు. దీంతో, ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడిపోతున్న కార్యాలయ ఉద్యోగులు ఇలా హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
RGV: దిమ్మతిరిగేలా.. టైం చూసి ఇచ్చాడయ్యా… ఆర్జీవీ..
Bhola Shankar: చిరు ‘భోళా శంకర్’ నిలిపివేత !! ఎందుకంటే ??
Bhola Shankar Review: చిరు ‘భోళా శంకర్’ హిట్టా ?? ఫట్టా ??
Ambati Rambabu: రేణు దేశాయ్ మాటలపై.. అంబటి రియాక్షన్
Posani Krishna Murali: ఆ విషయం గురించి చిరుకు ముందే చెప్పా.. పోసాని కృష్ణ మురళి కామెంట్స్