ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చారు.. కళ్లలో స్ప్రే కొట్టి..

Updated on: Dec 15, 2025 | 4:25 PM

జగ్గంపేటలో దారుణం చోటుచేసుకుంది. అద్దెకు ఇల్లు కావాలంటూ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఓనర్‌పై పెప్పర్ స్ప్రే కొట్టి, బంగారు నగలు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇల్లు అద్దెకు కావాలని వచ్చి ముగ్గురు వ్యక్తులు ఓనర్ కంట్లో పెప్పర్ స్ప్రే కొట్టి.. ఇంట్లోని బంగారు నగలు దోకెళ్లిన ఘటన జగ్గంపేటలో చోటుచేసు కుంది. బాధితుడి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగ్గంపేట శ్రీరామ నగర్ కాలనీకి చెందిన పైడిపల్లి సుబ్బలక్ష్మి ఇంట్లో గది అద్దెకు కావాలని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చారు. దీంతో ఓనర్ గది తాళం తెరిచి చూపిస్తున్నారు. ఇంతలో జేబులోంచి పెప్పర్ స్ప్రే తీసిన కేటగాళ్లు.. ఒనర్ కళ్లలో కొట్టారు. దీంతో కళ్లు మండిపోయిన ఓనర్ కేకలు వేసింది. దీంతో ఆ వ్యక్తులు ఆమెను కింద పడేసి ఆమె మెడలో ఉన్న బంగారంతో పాటు ఇంట్లోని నగలను దోచుకుని, ఆ తర్వాత ఓనర్‌ను ఇంట్లోవేసి బయట నుంచి గడియపెట్టి పరారయ్యారు. స్థానికుల సహాయంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఓనర్ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు తన మెడలో ఉన్న పుస్తెలతాడు, నల్లపూసలు వెరసి 3 కాసులు అపహరించినట్లు తెలిపారు. అయితే ఇదే వ్యక్తులు గత శుక్రవారం కూడా వచ్చి ఇల్లు చూసుకున్నారని.. తన సోదరుడ్ని తీసుకుని వస్తానని చెప్పి.. ఇవాళ వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు బాధితురాలు ఆరోపించారు. దీంతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు అక్కడి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబ్ చూసి ఆపరేషన్.. చివరికి..

మొదటిరాత్రి కోసం ఆశగా ఎదురుచూసిన వధువుకు ఊహించని షాక్‌..

Hyderabad: హైదరాబాద్‌కు బీచ్ వచ్చేస్తోందోచ్

పదేళ్ల రికార్డ్‌ బ్రేక్‌… మరో మూడు రోజులు బీ అలర్ట్‌

ఈ చెట్టు కాయలు సాక్షాత్తూ పరమశివుని ప్రతిరూపాలు