అక్కడ తోడేళ్లు… ఇక్కడ నక్కలు.. మనుషులపై దాడులు

|

Sep 14, 2024 | 1:45 PM

అడవి జంతువులకు ఏమైంది? వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తోడేళ్లు మనుషులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో పదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తోడేళ్లను బంధించే పనిలో పడ్డారు ఉత్తరప్రదేశ్‌ అటవీ అధికారులు. ఇప్పటికే ఐదు తోడేళ్లను బంధించారు. ఇంకో తోడేలును బంధించాల్సి ఉందని తెలిపారు.

అడవి జంతువులకు ఏమైంది? వనాలను వదిలి జనావాసాల్లోకి చొరబడుతూ మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తోడేళ్లు మనుషులపై దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. తోడేళ్ల దాడిలో పదిమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. తోడేళ్లను బంధించే పనిలో పడ్డారు ఉత్తరప్రదేశ్‌ అటవీ అధికారులు. ఇప్పటికే ఐదు తోడేళ్లను బంధించారు. ఇంకో తోడేలును బంధించాల్సి ఉందని తెలిపారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో నక్కలు జనాలపై విరుచుకుపడుతున్నాయి. రోడ్డుపై వెళ్లాలంటే మనుషులు భయపడుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో ఇద్దరు వ్యక్తులపై నక్క దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెహ్తీ ప్రాంతంలో ఓ నక్క ఒక్కసారిగా వచ్చి రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై దాడి చేసింది. దాని నుంచి తప్పించుకోవడానికి వారు ప్రయత్నించినప్పటికీ తీవ్రంగా గాయపరిచింది. బాధితులలో ఓ వ్యక్తి ఆ నక్కను పట్టుకొని దూరంగా విసిరివేయడంతో అది అక్కడి నుంచి పారిపోయింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!

అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా ??

ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. సోషల్‌ మీడియా బ్యాన్‌.. ఎందుకో తెలుసా ??

ఏకాకిగా ఏక శిలా మహాగణపతి.. నిలువ నీడలేకుండా..

దుబాయ్‌ యువరాణి సంచలన పోస్ట్‌.. ఈ డైవర్స్‌ వెరీ స్పెషల్‌ అంటూ..