అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా ??
నాగరిత పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో మానవత్వం నశించిపోతోందా? అనిపిస్తుంది ఈ హృదయ విదారక ఘటన చూస్తే... కన్నబిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సింది పోయి, మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని ఖరాఖండీగా చెప్పేసాడు ఓ ఇంటి ఓనరు. దాంతో పసివాడి మృతదేహాన్ని రోడ్డుపక్కన టెంట్ వేసి బంధువులు కడసారి చూసేందుకు ఏర్పాటు చేసారు
నాగరిత పెరుగుతున్నకొద్దీ మనుషుల్లో మానవత్వం నశించిపోతోందా? అనిపిస్తుంది ఈ హృదయ విదారక ఘటన చూస్తే… కన్నబిడ్డను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సింది పోయి, మృతదేహాన్ని ఇంటికి తీసుకురావద్దని ఖరాఖండీగా చెప్పేసాడు ఓ ఇంటి ఓనరు. దాంతో పసివాడి మృతదేహాన్ని రోడ్డుపక్కన టెంట్ వేసి బంధువులు కడసారి చూసేందుకు ఏర్పాటు చేసారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటన ఇబ్రహీం పట్నం మండలంలో సోమవారం జరిగింది. నిన్నమొన్నటి వరకూ ఆ ఇంటి పరిసరాల్లోనే ఆడుతూ పాడుతూ తిరిగిన ఆ బాలుడు.. మాయదారి వరద కారణంగా విషజ్వరానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అద్దెకుంటున్న ఇంటి యజమాని ఆ బాలుడి మృతదేహాన్ని ఇంట్లోకి రానీయకుండా అడ్డుకున్నాడు. దీంతో బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు చేసేది లేక జాతీయ రహదారి పక్కనే ఓ టెంటు వేసి బంధువుల కడసారి చూపుకోసం ఆ బాలుడి మృతదేహాన్ని ఉంచాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకో తెలుసా ??
ఏకాకిగా ఏక శిలా మహాగణపతి.. నిలువ నీడలేకుండా..
దుబాయ్ యువరాణి సంచలన పోస్ట్.. ఈ డైవర్స్ వెరీ స్పెషల్ అంటూ..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

