వెంటిలేటర్ పై ఉన్న బాలుడి పుట్టిన రోజు జరిపించి.. చిన్నారి కోరిక తీర్చిన ఆస్పత్రి సిబ్బంది..
అమాయకత్వం, కల్లాకపటం తెలియని బాల్యం అందరికి మధురమే.. అయితే ఎప్పుడు ఎలా ఎవరి జీవితం మారుతుందో ఎవరికి తెలుసు. ఓ బాలుడి జీవితంలో కూడా అనుకోని సంఘటన జరిగింది.
అమాయకత్వం, కల్లాకపటం తెలియని బాల్యం అందరికి మధురమే.. అయితే ఎప్పుడు ఎలా ఎవరి జీవితం మారుతుందో ఎవరికి తెలుసు. ఓ బాలుడి జీవితంలో కూడా అనుకోని సంఘటన జరిగింది. దీంతో వెంటిలేటర్ పైనే బాలుడితో కేక్ కట్ చేయించి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు హాస్పిటల్ సిబ్బంది. ఈ ఘటన జబల్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాంఝీకి చెందిన 13 ఏళ్ల బాలుడు కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. చిన్నారి ఆరోగ్యం విషమించడంతో ఐసీసీయూలో వెంటిలేటర్‌లో ఉంచి చికిత్సనందిస్తున్నారు. అయితే ఆ చిన్నారి తన పుట్టినరోజు జూన్ 22న అని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు ఉదయం నుండి.. ఆ పిల్లవాడు తన పుట్టినరోజు జరుపుకోవాలని కుటుంబ సభ్యులను పట్టుబట్టడం ప్రారంభించాడు. దీంతో డాక్టర్ శైలేంద్ర రాజ్‌పుత్.. చిన్నారి కోరికను తీర్చాలనుకున్నారు. వెంటనే చిన్నారి గది మొత్తాన్ని అలంకరించి, కేక్ తీసుకుని వచ్చారు. వెంటిలేటర్‌పైనే కేక్ కట్ చేయించి చిన్నారికి సంతోషాన్ని ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బస్టాప్‌లో కనిపించిన అనుమానాస్పద ప్లాస్టిక్ డబ్బా.. ఏంటా అని చెక్ చేయగా అధికారులకు ఫ్యూజులు ఔట్!
అందుకే పనస పండు తినాలంటారు.. బీపీ నుంచి రక్తహీనత వరకు.. ఎన్నో సమస్యలకు..