బస్టాప్‌లో కనిపించిన అనుమానాస్పద ప్లాస్టిక్ డబ్బా.. ఏంటా అని చెక్ చేయగా అధికారులకు ఫ్యూజులు ఔట్!

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో పిండాల అవశేషాలు కలకలం రేపాయి. ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు.

Phani CH

|

Jun 29, 2022 | 9:02 AM


కర్ణాటకలోని బెలగావి జిల్లాలో పిండాల అవశేషాలు కలకలం రేపాయి. ముదలగి పట్టణ శివార్లలోని ఓ బస్టాప్‌లో గుర్తు తెలియని వ్యక్తులు డబ్బాను వదిలి వెళ్లారు. గుర్తించిన స్థానికులు.. దానిని తెరచి చూడగా అందులో ఏడు పిండాల అవశేషాలు బయటపడ్డాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వాటిని భ్రూణహత్యలుగా నిర్ధారించారు. లింగ నిర్ధారణ చేసిన తర్వాత గర్భస్రావం చేశారని, అవి ఐదు నెలల నిండిన శిశువుల పిండాలని గుర్తించారు. కాగా, ఈ ఘటనపై వైద్యారోగ్యశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ఆ పిండాలని దవాఖానలో భద్రపరిచామని అధికారులు వెల్లడించారు. వాటిని పరీక్షల నిమిత్తం జిల్లా ఫంక్షనల్‌ సైన్స్‌ సెంటర్‌కు పంపిస్తామన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అందుకే పనస పండు తినాలంటారు.. బీపీ నుంచి రక్తహీనత వరకు.. ఎన్నో సమస్యలకు..

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu