Ivana Knoll Troll: జపాన్‌ను అవమానించిన క్రొయేషియా మోడల్.!అర్హత లేదంటూ పోస్ట్.. వైరల్ వీడియో.
ఫిపా వరల్డ్ కప్‌లో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఖతార్లో సంచలనం సృష్టించిన క్రొయేషియా మోడల్ మరోసారి వార్తల్లో నిలిచింది. కఠిన నిబంధనలు ఉన్న అరబ్ కంట్రీలో
ఫిపా వరల్డ్ కప్‌లో పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఖతార్లో సంచలనం సృష్టించిన క్రొయేషియా మోడల్ మరోసారి వార్తల్లో నిలిచింది. కఠిన నిబంధనలు ఉన్న అరబ్ కంట్రీలో పొట్టి బట్టలతో తన అందాలను ప్రదర్శించడమే కాకుండా అందుకు ఆ దేశం అనుమతిచ్చిందని తెలిపింది. తాజాగా ఇవానా నోల్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ఈసారి అందాలు ప్రదర్శించలేదు, జపాన్‌ను అవమానిస్తూ వార్తల్లోకి ఎక్కింది.ఫిఫా వరల్డ్‌కప్‌లో ప్రీక్వార్టర్స్‌లో భాగంగా డిసెంబర్ 5 రాత్రి క్రొయోషియా, జపాన్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. దీంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో జపాన్‌ను 3-1 తేడాతో క్రొయేషియా ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత ఇవానా నోల్ జపాన్‌ను ట్రోల్ చేసింది.జపనీయులకు సుషీ అనేది ఫెవరెట్ డిష్. వెంజర్డ్ రైస్, కూరగాయలు, ఇతర పదార్థాలను కలిపి ఈ డిష్‌ను తయారు చేస్తుంటారు. మ్యాచ్‌కు ముందు ఇవానా నోల్ తన ప్లేట్‌లో సుషీ డిష్‌ను ఉంచి.. ”జపాన్ మీకోసం మేము రెడీగా ఉన్నాం” అంటూ పోస్ట్ చేసింది. దీనర్థం ఏంటంటే జపాన్‌తో కలిసి సుషీ తినడానికి మేం రెడీ అని. అయితే జపాన్ మ్యాచ్ ఓడిపోవడంతో ఇవానా నోల్ మరో ఫోటో షేర్ చేసింది. ”ఈరోజు సుషీ మాత్రమే మా ఫుడ్‌మెనులో కనిపిస్తుంది.. పాపం జపాన్ దీన్ని తినే అర్హత కోల్పోయింది” అంటూ అవమానించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇవానా షేర్ చేయగా.. అవి వైరల్ అయ్యాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
