వైరల్ అవుతున్న ఈ వీడియోలో రెండు పక్షులు తమ పిల్లలను వెంటపెట్టుకొని రోడ్డు దాటి అవతలివైపుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో పక్షి పిల్లలు రోడ్డు డివైడర్ దాటలేక అక్కడే ఉండిపోయాయి. తల్లి పక్షి డివైడర్ దాటి అవతలికి వెళ్లిపోయాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి రోడ్డు క్రాస్ చేసి అక్కడున్న పక్షి పిల్లలను డివైడర్ దాటించుదామనుకుని వచ్చి, ఆ క్యూట్ బర్డ్స్‌ని చూసి వాటితో కొద్దిసేపు ఆడుకుందామని ట్రైచేసాడు. అంతే అది గమనించిన పెద్ద పక్షులు రెండూ ఆ వ్యక్తిని తరిమి తరిమి కొట్టాయి. ఆ పక్షులు వెంటపడటంతో ఆ వ్యక్తి పరుగుతీశాడు. పక్షి పిల్లల వద్దకు వ్యక్తి రావడాన్ని పసిగట్టిన పక్షి వెంటనే అప్రమత్తమై పేవ్‌మెంట్ నుంచి దూకి అతడిని వెంబడించాయి. ఈ మొత్తం సంఘటనను రికార్డు చేసిన ఓ మహిళ ఆ వ్యక్తి నిస్సహాయ స్ధితికి నవ్వుకుందే తప్ప ఎలాంటి సాయం చేయలేకపోయింది. ఇతరుల పిల్లల జోలికి ఎన్నడూ వెళ్లకండి అంటూ కాప్షన్ జోడిస్తూ ట్విట్టర్లో షేర్ చేసారు. కాగా ఈ వీడియోను వేలాదిమంది వీక్షించారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Actress Seetha: ఐదు పదుల వయసులోనూ చెక్కు చెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్న అలనాటి నటి సీత..
Marriage request: అయ్యో.. ఒంటరిగా ఉండలేకపోతున్న.. పెళ్లి చేయమని వేడుకున్న బ్రహ్మచారి.!
Elephant attack: ఏనుగుకి కోపం వస్తే.. గిట్లుంటది! షాకింగ్ వీడియో.. పాపం అవి మాత్రం ఎం చేస్తాయ్..