Bengaluru Water Crisis: నీటి క్యాన్లు చేత పట్టుకుని గంటల తరబడి క్యూ లైన్లలో ఐటీ ఉద్యోగులు.

|

Mar 21, 2024 | 10:16 AM

బెంగళూరులో ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్రప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేతపట్టుకుని గంటల తరబడి ఆర్‌ఓ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కార్యాలయాలకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోయారు. నీటి కష్టాలపై ఐటీ నిపుణులు తమ దాహార్తి కేకలు, బాధలు, ఇబ్బందులను సోషల్‌ మీడియాలో స్నేహితులతో పంచుకుంటున్నారు.

బెంగళూరులో ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్రప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేతపట్టుకుని గంటల తరబడి ఆర్‌ఓ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కార్యాలయాలకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోయారు. నీటి కష్టాలపై ఐటీ నిపుణులు తమ దాహార్తి కేకలు, బాధలు, ఇబ్బందులను సోషల్‌ మీడియాలో స్నేహితులతో పంచుకుంటున్నారు. కొన్ని వారాలపాటు వివిధ కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానానికి అనుమతించక తప్పడం లేదు. కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు ప్రయాణం కట్టారు. నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్‌ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. వంట పాత్రలు కడిగే పనిలేకుండా ప్రత్యామ్నాయాలు వెదుక్కుంటున్నారు. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది టెక్కీలు ఉదయాన్నే మినరల్ వాటర్ ప్లాంట్ల దగ్గర ఎదురుచూస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. అనేక అపార్ట్‌మెంట్లలో నీటి రేషన్‌ వ్యవస్థను అమలులోకి తెచ్చారు. నిర్ణయించిన స్థాయిలోనే వినియోగించాలి. ఎక్కువగా వాడితే జరిమానా విధిస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 రూపాయల వరకు నీటికే వెచ్చించక తప్పడం లేదు.

రాజధాని నగరంలో తలెత్తిన తాగునీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ పూర్తిగా ‘ట్యాంకర్‌ మాఫీయా’కు లొంగిపోయారని ప్రతిపక్ష నేత ఆర్‌.అశోక్‌ ఆరోపించారు. గడువు పూర్తయినా ప్రభుత్వ ఆదేశాలను ట్యాంకర్ల యజమానులు లెక్క చేయలేక అధిక రేట్లు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రైవేట్‌ సంస్థల సహకారంతో వార్డుకు ఒకటి చొప్పున సహాయవాణి కేంద్రాలను ప్రారంభించి ప్రజాసమస్యలకు స్పందించాలని ఒత్తిడి తెచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..