Gaza – Israel: హమాస్ మరో కీలక నేతను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌.. ధృవీకరించిన ఇజ్రాయెల్‌.

|

Oct 29, 2023 | 7:57 PM

హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్టోబరు 26న ఇజ్రాయెల్‌ గాజాలో ప్రారంభించిన భూతల దాడులు అక్టోబరు 27న కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో అనేక భవనాలు కుప్ప కూలాయి. అనేకమంది చనిపోయారు. మరోవైపు వైమానిక దాడులు కూడా చేసింది ఇజ్రాయెల్‌. ఈ దాడుల్లో హ‌మాస్ వైమానిక ద‌ళ అధిప‌తి ఇస్సామ్ అబూ రుక్బే హ‌త‌మయ్యాడు. శుక్రవారం రాత్రి జ‌రిగిన దాడిలో అత‌ను చ‌నిపోయిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొంది.

హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం కొనసాగుతోంది. అక్టోబరు 26న ఇజ్రాయెల్‌ గాజాలో ప్రారంభించిన భూతల దాడులు అక్టోబరు 27న కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో అనేక భవనాలు కుప్ప కూలాయి. అనేకమంది చనిపోయారు. మరోవైపు వైమానిక దాడులు కూడా చేసింది ఇజ్రాయెల్‌. ఈ దాడుల్లో హ‌మాస్ వైమానిక ద‌ళ అధిప‌తి ఇస్సామ్ అబూ రుక్బే హ‌త‌మయ్యాడు. శుక్రవారం రాత్రి జ‌రిగిన దాడిలో అత‌ను చ‌నిపోయిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొంది. హ‌మాస్ ఉగ్ర గ్రూపుకు చెందిన డ్రోన్లు, ఏరియ‌ల్ వెహికల్స్‌, ప్యారాగ్లైడ‌ర్స్‌, ఏరియ‌ల్ డిటెక్షన్ సిస్టమ్స్‌ను అబూ రుక్బే మేనేజ్ చేసేవాడ‌ని ఇజ్రాయిల్ మిలిట‌రీ పేర్కొంది. అక్టోబ‌ర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హ‌మాస్ చేసిన భీక‌ర రాకెట్ దాడిలో అబూ రుక్బే కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. రుక్బే ఆదేశాల ప్రకార‌మే హ‌మాస్‌కు చెందిన పారాగ్లైడ‌ర్లు.. ద‌క్షిణ ఇజ్రాయిల్ భూభాగంలోకి వ‌చ్చిన‌ట్లు ఐడీఎఫ్ తెలిపింది. త‌మ ర‌క్షణ ద‌ళాల పోస్టుల‌పై డ్రోన్లతో దాడి చేసింది కూడా రుక్బే వ‌ల్లే అని ఇజ్రాయిల్ పేర్కొంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..