Israel ICC Warrants: ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..

|

May 02, 2024 | 12:03 PM

కాల్పుల విరమణ చర్చలు కీలక దశకు చేరుకుంటున్న వేళ.. ఇజ్రాయెల్‌కు అంతర్జాతీయ నేర న్యాయస్థానం భయం పట్టుకుంది. 2014 నాటి గాజా యుద్ధం కేసులో తమ సైనిక అధికారులు, నేతలపై ఐసీసీ అరెస్టు వారెంట్లు జారీ చేయొచ్చన్న వార్తలపై ఆందోళన చెందుతోంది. ఈ ఊహాగానాలపై ఐసీసీ నుంచి ఎటువంటి సూచనలు లేనప్పటికీ, విదేశాంగశాఖ మాత్రం ఇతర దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను అప్రమత్తం చేసింది.

2014 నాటి గాజా యుద్ధంలో ఇజ్రాయెల్‌, హమాస్‌ మిలిటెంట్లు యుద్ధనేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అంతర్జాతీయ నేర న్యాయస్థానం మూడేళ్ల క్రితం విచారణను ప్రారంభించింది. పాలస్తీనీయన్లు తమ భవిష్యత్తు దేశం కోసం కోరుతున్న భూభాగంలో ఇజ్రాయెల్‌ స్థావరాలను నిర్మించడం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకుంది. అయితే.. ఈ కేసులో వారెంట్ల జారీపై ఇటీవల కాలంలో ఎటువంటి సూచనలు ఇవ్వలేదు. ఒకవేళ వారెంట్లు జారీ అయితే.. ఆ దేశ అధికారులను ఇతర దేశాల్లో అరెస్టు చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే గాజాలో భీకర దాడులపై నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. ఈ పరిణామం టెల్‌అవీవ్‌కు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుత గాజా యుద్ధంలో కూడా ఇజ్రాయెల్‌ నరమేధం జరిపిందా లేదా అన్న అంశంపైనా ఐసీసీ దర్యాప్తు చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.