రైలు 2 గంటలు లేటైతే అవన్నీ ఫ్రీ… IRCTC రూల్ మీకు తెలుసా?
భారతీయ రైల్వేలో రైళ్లు ఆలస్యం కావడం సాధారణం. అయితే, రాజధాని, దురంత, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే ప్రయాణికులకు IRCTC ఉచిత భోజనం లేదా అల్పాహారం అందిస్తుంది. తక్కువ ఆలస్యానికి టీ, కాఫీ, బిస్కట్లు ఉచితంగా లభిస్తాయి. ఈ నియమం ప్రీమియం రైళ్లలో రిజర్వేషన్ ఉన్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది.
భారతీయ రైల్వేలో రైళ్లు ఆలస్యం కావడం అనేది తరచుగా జరిగే విషయం. బిజీ రైల్వే స్టేషన్లలో గంటల కొద్దీ వేచి ఉండాల్సి వచ్చినప్పుడు ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించే IRCTC నియమం గురించి చాలామందికి తెలియదు. రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆలస్యమైనప్పుడు ఈ నియమం అమలులోకి వస్తుంది. రైలు రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యమైతే, ప్రయాణికులకు ఉచిత భోజనం పొందే హక్కు ఉంటుంది. ఆలస్యం అయిన సమయాన్ని బట్టి టీ, కాఫీ, బిస్కట్లు, బ్రెడ్ వంటివి కూడా ఉచితంగా అందిస్తారు. ఇటీవల ఒక ప్రయాణికుడు తన రాజధాని రైలు ఆరు గంటలు ఆలస్యం కావడంతో తనకు ఉచిత భోజనం అందిందని ఆన్‌లైన్‌లో పంచుకోవడం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మరిన్ని వీడియోల కోసం :
