AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రంగుల మిరపకాయలు .. క్యాప్సికం మాత్రం కాదండోయ్

రంగుల మిరపకాయలు .. క్యాప్సికం మాత్రం కాదండోయ్

Samatha J
|

Updated on: Jan 15, 2026 | 12:31 PM

Share

పచ్చని కారం .. ఏంటి కారం పచ్చగా ఎందుకు ఉంటుంది పసుపు కదా అనుకుంటున్నారా .. నిజమండి బాబు . ఇపుడు పచ్చని కారం మిరపకాయలు సైతం ఏలూరు ఏజెన్సీ వేలేరుపాడులో పండుతున్నాయి . వేలేరుపాడు మండలం నడిమిగుమ్మి గ్రామానికి చెందిన రైతు బుడిపిటి విక్రం వీటిని పండిస్తున్నారు. ఈయన తన 5 ఎకరాల పొలంలో ఒక ఎకరంలో పసుపు పచ్చ మిర్చి వేస్తే మరో నాలుగు ఎకరాల్లో ఎర్రని మిర్చి పండిస్తున్నారు. దీంతో పసుపు , ఎరుపు కలిసిన ఈ పొలం ఏలూరు ఏజెన్సీకి కొత్త అందాన్ని తెచ్చి పెట్టింది.

సాధారణంగా చేలో పసుపు పచ్చని బంతి పూలు విరబూస్తే చూడ ముచ్చటగా ఉంటుంది కదా … మిరప చేను కోతకు వచ్చిన సమయంలో పండు మిరపకాయల్తో కొమ్మలు భారంగా ఒరిగితే వాటి ఎరుపు రంగు , చెట్టు, ఆకుల ఆకుపచ్చదనంతో మిరపతోటలు అందంగా కనిపిస్తాయి. మార్కెట్ లో కాప్సికం మిర్చి రకంలో ఇలా పసుపు , ఆకుపచ్చ , ఎరుపు రంగులు చూసుంటారు. కానీ సాధారణ మిరపలోనూ ప్రత్యేకంగా పసుపు రంగుతో పండే మిరప ఇపుడు ఇతర రైతులను సైతం ఆకట్టుకుంటోంది. గుంటూరు నుంచి తెచ్చిన యూవీ , నరింగా ఎఫ్ – 1 హైబ్రిడ్ చిల్లీ విత్తనాలను జల్లి ., అలా నారు వేసిన ఎకరం పసుపు మిరప చేనుకు రూ 1.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టగా 25 క్వింటాళ్ళ దిగుబడి వచ్చినట్లుగా రైతు చెబుతున్నారు. గుంటూరు మార్కెట్ లో ఈ ఏడాది క్వింటా ధర రూ 40 వేలవరకు ఉండగా గత ఏడాది 60 వేల వరకు పలికిందన్నారు రైతులు. పసుపు రంగు మిరపను ప్రత్యేకంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆహారపదార్ధాల తయారీలో రంగు ప్రత్యేకంగా కనిపించేందుకు ఈ తరహా మిర్చిని వాడుతున్నారు. మరోవైపు స్నాక్స్ లో గార్నిష్ ఐటంగా కూడా ఈ మిర్చి వినియోగంలో వుంది.