పాములా మారుతున్న గొంగళిపురుగు !! వీడియో చూస్తా షాక్

|

Jul 15, 2022 | 9:46 AM

ప్రకృతిలో రకరకాల జీవులుంటాయి. అయితే కొన్నిటికి అవసరాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉంటుంది. అలాంటి వాటిలో గొంగళిపురుగు ఒకటి.

ప్రకృతిలో రకరకాల జీవులుంటాయి. అయితే కొన్నిటికి అవసరాన్ని బట్టి తన రూపాన్ని మార్చుకునే శక్తి ఉంటుంది. అలాంటి వాటిలో గొంగళిపురుగు ఒకటి. తాజాగా ఓ గొంగళిపురుగు పాములా మారి జనాలను భయపెడుతోంది. అవును.. హీమెరోప్లేన్స్ ట్రిప్టోలెమస్ (Hemeroplanes triptolemus) గురించి మాట్లాడుతున్నాం.. ఇది తాను ప్రమాదంలో ఉన్నట్లు గుర్తించిన వెంటనే పాములా మారుతుంది. తన దగ్గరకు ఎవరూ రాకుండా భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఈ జీవి హెమెరోప్లేన్స్ చిమ్మట, స్పింగిడే కుటుంబానికి చెందినది. ఈ జీవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మధ్య అమెరికాలోని అనేక ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే దీనిని చూడగానే కనిపించే నోరు లాగా కనిపించే భాగం నిజానికి అది నోరు కాదు.. ఇది ఎల్లప్పుడూ కొమ్మకు అతుక్కుపోయి ఉంటుంది. తనకు ఏదైనా ప్రమాదం రాబోతోంది అని గ్రహించగానే.. తన నోటి ముందు భాగాన్ని చూపించి బెదిరించి అక్కడ నుండి పారిపోతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!

బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త !!

Published on: Jul 15, 2022 09:46 AM