Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!

Blood Jewellery: రక్తంతో ఆభరణాలు తయారీ.. అది కూడా మానవుని రక్తం తో !!

Phani CH

|

Updated on: Jul 15, 2022 | 9:44 AM

మనం ఇప్పటి వరకు బంగారం, వెండి, ప్లాటినం, డైమండ్‌ ఇలా రకరకాల ఆభరణాలు చూసాం. ఆ మధ్య మనుషుల అస్తికలు, దంతాలతో కూడా ఆభరణాలు తయారు చేయడం చూశాం.

మనం ఇప్పటి వరకు బంగారం, వెండి, ప్లాటినం, డైమండ్‌ ఇలా రకరకాల ఆభరణాలు చూసాం. ఆ మధ్య మనుషుల అస్తికలు, దంతాలతో కూడా ఆభరణాలు తయారు చేయడం చూశాం. ఆఖరికి తల్లి పాలతో కూడా నగలు తయారు చేశారు.. తాజాగా మార్కెట్‌లోకి వీటన్నిటినీ తలదన్నే ఆభరణాలు రాబోతున్నాయి. యూఎస్‌కు చెందిన ప్రీతీ మాగో కంటి ఆస్ప్రతిలో ఆప్టోమెట్రిస్ట్‌గా పనిచేసేవారు. ఆమె ప్రెగ్నెంట్‌ అవ్వడంతో ఉద్యోగాన్ని వదిలేయవలసి వచ్చింది. అదీగాక బిడ్డ సంరక్షణ నిమిత్తం ఆమె ఉద్యోగానికే వెళ్లే అవకాశం లేకుండాపోయింది. ఆర్థిక స్వాతంత్య్రం కూడా కోల్పోవడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్న ఆమెకు తల్లిపాలతో జ్యూవెలరీ తయారు చేయడం గురించి సోషల్‌ మాధ్యమాల ద్వారా తెలుసుకుంది. దీంతో ఆమె ఆ దిశగా తన గమ్యాన్ని మార్చుకుంది. తన భర్త సాయంతో యూఎస్‌లో వివిధ జ్యూవెలరీ కోర్సులను నేర్చుకుంది. తల్లిపాలతో చేసే ఆభరణాల దగ్గర నుంచి బొడ్డుతాడు, వెంట్రుకలు, దంతాలు ఉపయోగించి ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం సాధించారు. అంతే తాను చేసే ఆభరణాలు వీటన్నిటికంటే భిన్నంగా ఉండాలనుకున్నారు. అంతే రక్తంత ఆభరణాలు తయారుచేయడం మొదలు పెట్టారు. మనకు ఇష్టమైన వాళ్లు మనల్ని విడిచి వెళ్లిపోయినప్పుడు… వారి శరీరం నుంచి సేకరించిన రక్తంతో రూ పొందించిన అందమైన లాకెట్లు వారి గుర్తుగా ఉంటాయని తెలిపారు. తాను డీఎన్‌ఏ కలిగిన మెటీరియల్‌ని ఉపయోగించి ఈ ఆభరణాలను రూపొందించనట్లు ప్రీతి తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయటకు వెళ్లే హడావుడిలో షూ వేసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త !!

Published on: Jul 15, 2022 09:44 AM