ఇలాంటి బ్రతుకు.. బ్రతికిన ఒకటే.. సచ్చినా ఒకటే.. తండ్రి
తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. రూ.3 కోట్ల బీమా సొమ్ము కోసం ఇద్దరు కుమారులు తమ తండ్రిని పాముకాటుతో చంపించి, దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారు. బీమా క్లెయిమ్ ప్రక్రియలో అనుమానంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, ఈ కుట్ర బట్టబయలైంది. తిరువళ్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనలో కొడుకులతో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
తమిళనాడులో దారుణం జరిగింది. కన్న తండ్రిని హత్య చేయించి, అది పాము కాటు మరణంగా చిత్రీకరించారు ఇద్దరు కుమారులు. రూ.3 కోట్ల బీమా సొమ్ము కోసమే వారు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తోంది. బీమా క్లెయిమ్ ప్రక్రియలో అధికారులకు వచ్చిన అనుమానంతో ఈ హత్య వెనుక ఉన్న కుట్ర బయటపడింది. తిరువళ్లూరు జిల్లాకు చెందిన 56 ఏళ్ల గణేశన్ ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. అక్టోబర్‌లో ఆయన పాము కాటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అంత్యక్రియలు పూర్తయ్యాక, గణేశన్ పేరు మీద ఉన్న రూ.3 కోట్ల బీమా కోసం ఆయన ఇద్దరు కుమారులు బీమా సంస్థను సంప్రదించారు. గణేశన్ పేరు మీద అధిక మొత్తంలో పలు బీమా పాలసీలు ఉండటం, క్లెయిమ్ కోసం వచ్చిన కుమారుల ప్రవర్తనపై అనుమానం రావడంతో బీమా సంస్థ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. బీమా డబ్బు కోసమే కొడుకులు పథకం ప్రకారం తండ్రిని హత్య చేయించారని తేలింది. హత్యకు వారం రోజుల ముందు కూడా ఓసారి ప్రయత్నించి విఫలమయ్యారని విచారణలో నిందితులు అంగీకరించారు. ఆ తర్వాత అత్యంత విషపూరితమైన పామును తీసుకొచ్చి, నిద్రిస్తున్న తండ్రి మెడపై కాటు వేయించారు. అది ప్రమాదమని నమ్మించేందుకు పామును అక్కడే చంపేశారు. అంతేకాకుండా, ఉద్దేశపూర్వకంగానే ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరు కుమారులతో పాటు వారికి సహకరించిన మరో ఆరుగురిని అరెస్టు చేసారు పోలీసులు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రయాణికుడిపై ఎయిరిండియా పైలట్ పిడిగుద్దులు.. కారణం
ఇలా అయిపోతున్నారేంట్రా.. హైవేపై బ్రిడ్జికి వేలాడుతూ పుల్‌అప్స్.. అక్కడ నుండి..
Boyapati Sreenu: ట్రోల్స్ పై బోయపాటి రియాక్షన్.. ఆల్రెడీ హమ్‌నే కాషన్ కీయ