కొట్టేసిన సోమ్ముతో కుంభమేళాకు.. గర్ల్‌ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌

Updated on: Feb 26, 2025 | 4:34 PM

ప్రయాగ్ రాజ్ లోని మహా కుంభమేళాలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 26న మహాకుంభమేళా ముగియనుంది. ఇప్పటికీ అనేక మంది కుంభమేళాకు వెళ్తున్నారు. ఈ సారి జరుగుతున్న కుంభమేళా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు.

ఎవరికి తోచిన విధంగా వాళ్లు కుంభమేళాకు వెళ్తున్నారు. కొంతమంది రైళ్లు, బస్సులు, కార్లలో కుంభమేళాకు వెళ్తున్నారు. అలాగే కొంతమంది ఆటోలో కూడా కుంభమేళాకు వెళ్లిన వాళ్లు ఉన్నారు. అయితే వీళ్లంతా కష్టపడి సంపాదించిన డబ్బులతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇండోర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయగా వచ్చిన రూ.7 లక్షల డబ్బుతో తమ లవర్లతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. కానీ ఇంటికి వచ్చిన తరువాత ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీసులు ఊహించని షాకిచ్చారు. ఇద్దరు వ్యక్తులను అజయ్ శుక్లా, సంతోష్ కోరిగా గుర్తించారు, వీరిపై ఇప్పటికే ఇండోర్‌లో పలు దొంగతనం కేసులు నమోదయ్యాయి. ద్వారకాపురిలో గత 15 రోజుల్లో దోపిడీ సంఘటనలు పెరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ ప్రాంతంలోని నాలుగు ఇళ్లలో దొంగతనం జరిగిందని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన ప్రాంతంలో లభించిన ఫింగర్‌ప్రింట్స్‌ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. వారి మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేయగా.. వారిద్దరూ మహా కుంభమేళాకు వెళ్లినట్లుగా తేలింది. దీంతో వారు ఇండోర్‌కు తిరిగి వచ్చిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని మహా కుంభమేళా జర్నీకి వారి లవర్ల కోసం ఖర్చు చేశారని డీసీపీ రిషికేశ్ మీనా తెలిపారు. వారి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వృద్ధురాలైన తల్లిని ఇంట్లో లాక్‌ చేసి కుంభమేళాకు వెళ్లిన కొడుకు

TOP 9 ET News: ‘ప్రభాస్‌’ పేరుతో ఊరు.. ఖుషీగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ | జస్ట్ మిస్.. లేదంటే.. పుష్ప2 రికార్డ్ బద్దలయ్యేది