గాజు టవర్ ను చూసారా? అక్కడి నుంచి భూటాన్‌ను చూడొచ్చు
దేశంలోని అత్యంత ఎత్తైన గాజు టవర్ పర్యటకులకు థ్రిల్ ఇస్తోంది. 98 అడుగుల ఎత్తున్న ఈ గాజు టవర్ నుంచి భూటాన్‌తో పాటు డూయర్స్‌ను చూసేయవచ్చు. హిమాలయాల దిగువన ఉన్న ప్రాంతాలను డూయర్స్గా పిలుస్తారు. అలాగే అందమైన నీలాకాశం, దూరంగా కనిపించే పర్వత ప్రాంతాలు, పచ్చనైనా ప్రదేశాలను ఆస్వాదించొచ్చు. బంగాల్లోని అలీపుర్దువార్‌లోని ఓ పార్క్‌లో గాజు టవర్‌ను నిర్మించారు.
ఇది పర్యటకులకు ప్రధాన ఆకర్షణగా మారింది. అలాగే చూపరులను ఆకట్టుకుంటోంది. అహ్మదాబాద్ తర్వాత దేశంలో ఇదే రెండో గాజు టవర్. పుణెకు చెందిన ఒక కంపెనీ దీన్ని నిర్మించింది. ఈ టవర్‌కు చైనా షాంఘైలోని గాజు టవర్‌తో కొన్ని సారూప్యతలు ఉన్నాయి. అయితే, కాపీరైట్ కారణంగా అలీపుర్దువార్‌లోని గాజు టవర్ నిర్మాణంలో కొన్ని మార్పులు చేశారు. దుర్గా పూజ సెలవుల్లో డూయర్స్‌ను సందర్శిండానికి వచ్చేటప్పుడు పర్యటకులు ఈ గాజు టవర్ ద్వారా అందమైన దృశ్యాన్ని ఆస్వాదిస్తారని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. హిమాలయాల దిగువన ఉన్న ప్రాంతాలను డూయర్స్గా పిలుస్తారు. ఈశాన్య భారతదేశంలో ఉన్న ఈ సుందరమైన ప్రాంతం దాని పచ్చని టీ తోటలు, దట్టమైన అడవులు, గొప్ప జీవవైవిధ్యం, అనేక వన్యప్రాణుల అభయారణ్యాలకు నిలయంగా ఉంది. ఈ ప్రాంతాలను దుర్గాపూజ సమయంలో పర్యటకులు ఎక్కువగా సందర్శిస్తారు. ఈ గాజు టవర్‌పైకి ఎక్కి బాక్సర్ జంగిల్, భూటాన్‌ను చూడవచ్చు. టవర్ పైభాగంలో అనేక బైనాక్యులర్లు ఉన్నాయి. సెల్ఫీ జోన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఒకేసారి మొత్తం 25 మంది టవర్ ఎక్కవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ దందాతో కెమికల్ పరిశ్రమలపై డౌట్స్
బిహార్ ఎన్నికల్లో హెలికాప్టర్లకు పెరిగిన డిమాండ్
