భారత ఆర్మీలోకి త్రిశూల్, వజ్ర.. ఇక చైనా సైనికులకు చుక్కలే.. వీడియో

భారత ఆర్మీలోకి త్రిశూల్, వజ్ర.. ఇక చైనా సైనికులకు చుక్కలే.. వీడియో

Phani CH

|

Updated on: Oct 24, 2021 | 7:42 PM

పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్‌ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది.

పరమశివుని చేతిలో త్రిశూలం..ఇప్పుడిక భారత బలగాల చేతుల్లో ఆయుధంగా మారనుంది. డ్రాగన్‌ ఆర్మీకి షాకిచ్చేందుకు త్రిశూల్, వజ్ర పేర్లతో ప్రాణహాని కలిగించని ఆయుధాలను భారత సైన్యం సిద్ధం చేసుకుంటోంది. గల్వాన్‌ ఘటన సమయంలో చైనా బలగాలు ఇనుపరాడ్లు, ఇనుప ముళ్లు లాంటి ఆయుధాలతో భారత సైనికులపైకి దాడికి వచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో ఘర్షణల సమయంలో ప్రాణహాని కలిగించని ఆయుధాలనే వాడాలంటూ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు చైనా ఆర్మీ అప్పట్లో వీటిని ఉపయోగించింది. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని చైనా సరిహద్దుల్లోని భారత బలగాలు దీటైన వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయి. చైనా సైన్యం వాడిన మాదిరిగా సంప్రదాయ ఆయుధాలనే భారత సైన్యం కూడా సమకూర్చుకుంటోంది. ఈ మేరకు బాధ్యతలను నోయిడాకు చెందిన అపాస్టెరాన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థకు అప్పగించింది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

బిల్‌ గేట్స్‌ కుమార్తె వివాహం.. ఖర్చుఎంతో తెలిస్తే షాకవుతారు.. వీడియో

Viral Video: 84 ఏళ్ల వయస్సులో విమానం నడిపిన వృద్ధురాలు.. వీడియో

Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో

దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి