Heart Stops: ఒకే రోజు ఆరుసార్లు ఆగిన ఇండో అమెరికన్ విద్యార్ధి గుండె.. వీడియో వైరల్..
ఓ విద్యార్ధి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. వైద్యులు ఆపరేషన్ చేయడంతో బ్రతికి బయటపడ్డాడు. అతను పల్మనరీ ఎంబోలిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీని కారణంగా అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అతుల్ రావు అనే ఇండో అమెరికన్ విద్యార్ధి టెక్సాస్‌లోని బేలార్ యూనివర్సిటీలో ప్రీ మెడ్ డిగ్రీ చదువుతున్నాడు.జులై 27న అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఓ విద్యార్ధి గుండె ఒకే రోజు ఆరుసార్లు ఆగింది. వైద్యులు ఆపరేషన్ చేయడంతో బ్రతికి బయటపడ్డాడు. అతను పల్మనరీ ఎంబోలిజం అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీని కారణంగా అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అతుల్ రావు అనే ఇండో అమెరికన్ విద్యార్ధి టెక్సాస్‌లోని బేలార్ యూనివర్సిటీలో ప్రీ మెడ్ డిగ్రీ చదువుతున్నాడు. జులై 27న అతడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన సెక్యూరిటీ గార్డు.. అతడికి సీపీఆర్ చేసే ప్రయత్నం చేశాడు. తోటి విద్యార్థుల సమాచారంతో అంబులెన్స్ కూడా క్షణాల్లో అక్కడకు చేరుకుంది. అనంతరం అతని గుండె కొట్టుకుంటున్నట్లు అంబులెన్సులోని పారామెడికల్ సిబ్బంది గుర్తించారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకడుతుండటంతో గుండెకి రక్తం సరఫరాలో ఆటంకం కలుగుతోందని గుర్తించారు. ఇలా రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతినడంతోనే గుండెపోటుకు దారితీస్తున్నట్లు అనుమానించారు. ఆ క్రమంలో కొన్ని గంటల వ్యవధిలోనే ఆ విద్యార్థి గుండె ఆరుసార్లు ఆగిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీనినే పల్మనరీ ఎంబోలిజం అంటారని వైద్యులు తెలిపారు. అతుల్‌ను పరీక్షించిన వైద్యులు వెంటనే శస్త్ర చికిత్స చేశారు. దాంతో అతుల్ రావు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వైద్యుల కృషితో అతడి ఆరోగ్యం మెల్లగా కుదుటపడింది. ఎక్మో అవసరం లేకుండానే అతుల్ కోలుకున్నాడు. రెండు వారాల తర్వాత సెయింట్ థామస్ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అవడంతో వైద్యులు, అతడి కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. తమ కుమారుడిని రక్షించిన లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీ హెల్త్‌కేర్ ఆసుపత్రి వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు అతుల్ తల్లిదండ్రులు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇంపీరియల్ కాలేజీ హెల్త్‌కేర్ కూడా తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..