NRI Fraud: విలాసాల కోసం రూ. 183 కోట్లు కొట్టేసాడు. ఫుట్‌బాల్ జ‌ట్టుకు టోక‌రా ఇచ్చిన ప్రవాసీ అమిత్‌ పటేల్‌.!

|

Dec 11, 2023 | 9:32 AM

అమెరికాలో ఉంటున్న ఓ ప్రవాస భార‌తీయుడు త‌న విలాసాల కోసం త‌ప్పుడు మార్గంలో డ‌బ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు పెద్ద ప‌థ‌క‌మే వేసిన అత‌డు.. గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసిన అమెరికా ఫుట్‌బాల్ ఫ్రాంచైజ్‌ జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌ నుంచి ఏకంగా రూ.183 కోట్లు దొంగిలించాడు. అత‌డి పేరు అమిత్ పటేల్. ఫ్రాంచైజ్‌ క‌ళ్లుగ‌ప్పి కాజేసిన‌ డ‌బ్బుతో అమిత్ ఫ్లోరిడాలో భారీ భ‌వ‌నం కొన్నాడు. అంతేకాదు ఎక్కడివెళ్లినా ప్రైవేట్ జెట్స్‌లోనే ప్రయాణించేవాడు.

అమెరికాలో ఉంటున్న ఓ ప్రవాస భార‌తీయుడు త‌న విలాసాల కోసం త‌ప్పుడు మార్గంలో డ‌బ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకు పెద్ద ప‌థ‌క‌మే వేసిన అత‌డు.. గతంలో తాను ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేసిన అమెరికా ఫుట్‌బాల్ ఫ్రాంచైజ్‌ జాక్సన్‌విల్లే జాగ్వార్స్‌ నుంచి ఏకంగా రూ.183 కోట్లు దొంగిలించాడు. అత‌డి పేరు అమిత్ పటేల్. ఫ్రాంచైజ్‌ క‌ళ్లుగ‌ప్పి కాజేసిన‌ డ‌బ్బుతో అమిత్ ఫ్లోరిడాలో భారీ భ‌వ‌నం కొన్నాడు. అంతేకాదు ఎక్కడివెళ్లినా ప్రైవేట్ జెట్స్‌లోనే ప్రయాణించేవాడు. ఖ‌రీదైన టెస్లా కారు, చేతి గ‌డియారాల‌తో పాటు క్రిప్టో కరెన్సీ కొన్నాడు. ప‌లు విదేశీ ప‌ర్యట‌న‌ల కోసం అమిత్ ఆ డ‌బ్బును ఖ‌ర్చు చేశాడు.

జాక్సన్‌విల్లే జాగ్వార్స్ ఫుట్‌బాల్ ఫ్రాంచైజ్‌లో అమిత్ పటేల్ ఆర్ధిక విశ్లేష‌ణ‌, ప్లానింగ్ టీమ్‌కు మేనేజ‌ర్‌గా జాయిన్ అయ్యాడు. జాగ్వార్స్ ఉగ్యోగుల లావాదేవీల కోసం యాజ‌మాన్యం వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును ప్రవేశ‌పెట్టింది. మొద‌ట్లో న‌మ్మకంగా ప‌నిచేసిన అమిత్ ఫ్రాంచైజ్‌ న‌మ్మకం చూర‌గొన్నాడు. కొన్నాళ్లకు అత‌డు విలాస‌వంత‌మైన జీవితం గ‌డ‌పాల‌నే ఆలోచ‌న‌తో అడ్డదారులు తొక్కాడు. వ‌ర్చువ‌ల్ క్రెడిట్ కార్డును దుర్వినియోగం చేసిన అమిత్ క్యాట‌రింగ్, విమాన చార్జీలు, హోట‌ల్ బిల్లుల‌ను కొత్తగా సృష్టించాడు. మూడేళ్ల కాలంలో అలా అమిత్… జాగ్వార్స్ ఖాతా నుంచి రూ.183 కోట్లు కొట్టేశాడు. ఈ విష‌యం బ‌య‌ట‌ప‌ప‌డంతో జాక్సన్‌విల్లే జాగ్వార్స్ మేనేజ్‌మెంట్ అమిత్‌ను ఈ ఏడాది ఫిబ్రవ‌రిలో ఉద్యోగం నుంచి తీసేసింది. త‌న విలాసాల కోసం భారీ ఆర్థిక నేరానికి పాల్పడిన‌ అమిత్ ప్రస్తుతం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Dec 11, 2023 09:28 AM