Bullet Train Station: దేశంలోనే తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిందిగా.! గ్లింప్స్‌ను షేర్ చేసిన రైల్వే మంత్రి.
దేశంలో తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ రైల్వే స్టేషన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మాణం జరుగుతోంది. దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లోని ఈ రైల్వేస్టేషన్ గ్లింప్స్‌ను రైల్వే మంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దేశంలో తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆ రైల్వే స్టేషన్‌కు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. అత్యాధునిక హంగులతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తలపిస్తున్న ఈ రైల్వే స్టేషన్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మాణం జరుగుతోంది. దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ ఇది. సబర్మతి మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లోని ఈ రైల్వేస్టేషన్ గ్లింప్స్‌ను రైల్వే మంత్రి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముంబయి-ఆహ్మదాబాద్ మధ్య దేశంలోనే తొలిసారి హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం చేపట్టారు. దేశంలోని రెండు ఆర్థిక నగరాలను కలుపుతున్న ఈ రైలు మార్గం 508 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ మార్గంలో 26 కిలోమీటర్ల మేర సొరంగాలు, 10 కిలోమీటర్ల మేర వంతెనలు, ఏడు కిలోమీటర్లు మేర కరకట్టలు ఉన్నాయి. అహ్మదాబాద్ స్టేషన్‌ను జంట భవనాలుగా రూపొందించారు. వీటి గోడలపై ఉప్పు సత్యాగ్రహం సన్నివేశాలకు సంబంధించిన భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ మొత్తం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. మరోవైపు ముంబయిలో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ స్టేషన్ సివిల్ వర్క్స్ దాదాపు 15శాతం పూర్తయ్యాయని నవంబరులో నేషనల్ హైస్పీడ్ కార్పొరేషన్ వెల్లడించింది. మొత్తం బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బీకేసీ పనులు ఇప్పటికే 15 శాతం పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టులోని ఏకైక అండర్‌గ్రౌండ్ స్టేషన్ ఇదే. 16 కోచ్‌ల బుల్లెట్ రైలు కోసం నిర్మించిన ఈ స్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
బిచ్చగాడి ఆస్తి చూసి అంతా షాక్ !! ఇనప్పెట్టె తీస్తే నోట్ల కట్టలు
ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. కవ్వాల్ అభయారణ్యంలో అడవి దున్న
ప్రపంచ రికార్డు సృష్టించిన అత్యంత పెద్ద నత్త ను చూసారా ??
అసలు ఆమె తల్లేనా ?? తాగిన మత్తులో 12 ఏళ్ల కొడుక్కి వింత శిక్ష
నగరాభివృద్ధికి 21 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన దాత
గోమాత మాతృ హృదయం.. మేకపిల్ల ఆకలి తీర్చి..
మంత్రగత్తె అనుమానంతో.. మహిళకు నిప్పంటించిన మూక

