ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

|

Apr 26, 2024 | 9:37 PM

కెనడాలో ఉచిత ఆహారం కోసం కక్కుర్తి పడ్డ ఓ భారతీయుడు చివరకు తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. బీదలు, విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఫుడ్‌తో భారీగా డబ్బు పొదుపు చేశానంటూ అతడు చేసిన వీడియో చివరకు భస్మాసురహస్తంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మేహుల్ ప్రజాపతి ఓ డేటా సైంటిస్ట్. కెనడాలోని టీడీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతడి జీతం ఏడాదికి 98 వేల డాలర్లు. జీవితంలో ఉన్నతస్థితికి చేరుకున్న మేహుల్..

కెనడాలో ఉచిత ఆహారం కోసం కక్కుర్తి పడ్డ ఓ భారతీయుడు చివరకు తన ఉద్యోగం పోగొట్టుకున్నాడు. బీదలు, విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఫుడ్‌తో భారీగా డబ్బు పొదుపు చేశానంటూ అతడు చేసిన వీడియో చివరకు భస్మాసురహస్తంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే, మేహుల్ ప్రజాపతి ఓ డేటా సైంటిస్ట్. కెనడాలోని టీడీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతడి జీతం ఏడాదికి 98 వేల డాలర్లు. జీవితంలో ఉన్నతస్థితికి చేరుకున్న మేహుల్.. తాను ఉచిత ఆహారంతో ఎంత డబ్బు పొదుపు చేసిందీ చెబుతూ ఓ వీడియో చేశాడు. స్థానికంగా అందుబాటులో ఉన్న ఫుడ్ బ్యాంకుల నుంచి ఆహారం, పచారీ సామాన్లు తీసుకుంటూ వందల కొద్దీ డాలర్లు పొదుపు చేసినట్టు అతడు గర్వంగా చెప్పుకొచ్చాడు. పేదలు, విద్యార్థులను ఆదుకునేందుకు విదేశాల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు ఫుడ్ బ్యాంక్స్ ఏర్పాటు చేస్తుంటాయి. ఆర్థికకష్టాల్లో ఉన్నవాళ్లు ఇక్కడి ఆహారంతో కడుపు నింపుకుంటూ ఉంటారు. స్థానికులు చాలా మంది ఫుడ్ బ్యాంక్స్‌కు వెళ్లడం అవమానంగా భావిస్తారు. విధి లేని పరిస్థితుల్లోనే ఫుడ్ బ్యాంక్స్‌ను ఆశ్రయిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బెంగళూరులో మహిళా టెకీ కష్టాలు.. వర్క్‌ ఫ్రం ట్రాఫిక్ అంటూ నెటిజన్ల కామెంట్లు

హైదరాబాదీలకు గుడ్‌ న్యూస్‌.. ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు

విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌

వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !! వైరల్‌ అవుతున్న వీడియో

నిద్రకు ముందు ఈ చిన్న పని చేస్తే.. మందుల అవసరమే ఉండదు