Indian Army Eagles: పాక్ డ్రోన్లకు చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీ నయా ప్లాన్.. గద్దలతో ఎట్టాక్.. వీడియో
ఇటీవల భారత సరిహద్దులు దాటి గగనతలంలోకి తరచూ డ్రోన్లు చొరబడుతున్నాయి. పాకిస్థాన్ హద్దు దాటి భారత గగనతలంలోకి డ్రోన్లతో చొరబడటం ఎక్కువైపోయింది.
ఇటీవల భారత సరిహద్దులు దాటి గగనతలంలోకి తరచూ డ్రోన్లు చొరబడుతున్నాయి. పాకిస్థాన్ హద్దు దాటి భారత గగనతలంలోకి డ్రోన్లతో చొరబడటం ఎక్కువైపోయింది. దాయాది దేశం కవ్విపు చర్యలకు చెక్ పెట్టేందుకు భారత సైన్యం కొత్త ఎత్తుగడ వేసింది. పాక్ డ్రోన్లను ఎదుర్కోడానికి గద్దలను రంగంలోకి దింపింది. సరిహద్దు భద్రతా బలగాలు పాక్ డ్రోన్లను కూల్చివేస్తున్నప్పటికీ, భారత సైన్యం ప్రత్యామ్నాయంగా గాల్లో ఎగిరే డ్రోన్లను అడ్డుకోవడానికి గద్దలకు శిక్షణ ఇస్తోంది. డ్రోన్లను కట్టడి చేసేందుకు గద్దలను ఉపయోగించడం ఇదే ప్రథమం.భారత్, అమెరికా సంయుక్తంగా చేపడుతున్న సైనిక విన్యాసాలు యుద్ధ్ అభ్యాస్ లో భాగంగా గద్దలు డ్రోన్లను కూల్చివేయడాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ఓ డ్రోన్ ను ఆర్మీ సిబ్బంది గాల్లోకి ఎగురవేయగా, ఆర్మీకే చెందిన ఓ శునకం దాన్ని గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేసింది. వెంటనే సిబ్బంది తమ వద్ద ఉన్న శిక్షణ పొందిన గద్దను డ్రోన్ దిశగా గాల్లోకి వదిలారు. ఆ గద్ద డ్రోన్ ను గుర్తించి విజయవంతంగా నేలకూల్చింది. ఆ గద్ద పేరు అర్జున్. డ్రోన్లను గుర్తించడంలో గద్దలకే కాదు శునకాలకు కూడా భారత సైన్యం శిక్షణ ఇచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

