India-China: పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో ఆసక్తికర పరిణామం.

|

Aug 31, 2024 | 5:44 PM

ఓ వైపు లద్దాఖ్‌ సరిహద్దులో సైనిక ప్రతిష్టంభన.. మరోవైపు హిందూ మహాసముద్రంలో పట్టు కోసం ప్రయత్నాలు.. ఇలా అనేక అంశాల్లో గత కొంతకాలంగా భారత్‌ , చైనా టెన్షన్‌ కొనసాగుతున్న వేళ ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీలంక తీరంలో రెండు దేశాల యుద్ధ నౌకలు పక్కపక్కనే లంగరేశాయి. క్షిపణి విధ్వంసక భారత యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ ముంబయి’ సోమవారం అధికారిక పర్యటన కోసం కొలంబో తీరానికి చేరుకుంది.

ఓ వైపు లద్దాఖ్‌ సరిహద్దులో సైనిక ప్రతిష్టంభన.. మరోవైపు హిందూ మహాసముద్రంలో పట్టు కోసం ప్రయత్నాలు.. ఇలా అనేక అంశాల్లో గత కొంతకాలంగా భారత్‌ , చైనా టెన్షన్‌ కొనసాగుతున్న వేళ ఆసక్తికర సంఘటన జరిగింది. శ్రీలంక తీరంలో రెండు దేశాల యుద్ధ నౌకలు పక్కపక్కనే లంగరేశాయి. క్షిపణి విధ్వంసక భారత యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్‌ ముంబయి’ సోమవారం అధికారిక పర్యటన కోసం కొలంబో తీరానికి చేరుకుంది. అదే సమయంలో చైనా కు చెందిన మూడు యుద్ధ నౌకలు ‘హీ ఫీ’, ‘వుజిషాన్‌’, ‘క్విలియాన్‌షాన్‌’ కూడా ఇదే పోర్టుకు అధికారిక పర్యటనకు వచ్చాయని శ్రీలంక నేవీ ఓ ప్రకటనలో తెలిపింది.

మూడు రోజుల పర్యటన నిమిత్తం 410 మంది సిబ్బందితో ‘ఐఎన్‌ఎస్‌ ముంబయి’ శ్రీలంక తీరానికి వెళ్లింది. ఈ నౌకకు శ్రీలంక నేవీ సాదర స్వాగతం పలికింది. శ్రీలంక నేవీతో కలిసి కలిసి ఇది పలు కార్యక్రమాల్లో పాల్గొననుంది. ‘ఐఎన్‌ఎస్‌ ముంబయి’ కొలంబో తీరంలో ఉన్న సమయంలోనే చైనా యుద్ధనౌకలు కూడా అక్కడకు చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘హీ ఫీ’ యుద్ధ నౌకలో 267 మంది, ‘వుజిషాన్‌’లో 872 మంది, ‘క్విలియాన్‌షాన్‌’లో 334 మంది చైనీస్‌ సిబ్బంది ఉన్నారు. ఇవి హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించినప్పటికీ నుంచి వీటి కదలికలను భారత నేవీ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూనే ఉంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.