Auto vala: అర్ధరాత్రి ఆటోవాలాల వీరంగం.. రోడ్డుపైకి టపాసులు విసురుతూ హల్‌చల్..(వీడియో)
దీపావళి పండగను పురస్కరించుకుని ఎన్టీఆర్ కృష్ణాజిల్లా గన్నవరంలో కొందరు ఆటో డ్రైవర్లు అర్థరాత్రి హల్‌చల్ చేశారు. పండగ పేరుతో 16వ నెంబర్ జాతీయ రహదారిపై వేగంగా ఆటోలో దూసుకుపోతూ రోడ్డు మీదే టపాసులు పేల్చుతూ బీభత్సం సృష్టించారు.
ఇదే సమయంలో రోడ్డుపై మహిళలు రావడం చూసి మరింత రెచ్చిపోయారు. ఆటోలో నుంచి రోడ్డు మీదకు టపాసులు విసిరేసి.. పెద్ద పెద్ద శబ్ధాలతో వీరంగం చేశారు. ఈ క్రమంలో రోడ్డుపై నడుస్తున్న మహిళలు, ఇతర వాహనదారులు తీవ్ర భయాందోళన చెందారు. ప్రజలు రోడ్ల మీద సంచరిస్తున్న సమయంలో ఆటోలో నుంచి టపాసులు పేల్చుతూ భయబ్రాoతులకు గురి చేశారు. ఎనిమిది మంది ఉన్న ఈ ఆటో దావాజీగూడెం నుంచి సెయింట్ జోన్స్ మీదుగా ప్రయాణించింది.కాగా ఆటోవాలల ఆగడాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే పోలీసులు కూడా ఈ ఆటోడ్రైవర్ల ఆగడాలను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పండగ పేరుతో ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదంటున్నారు స్థానిక ప్రజలు. పోలీసులు తక్షణమే స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
