Viral: ఆ ఊళ్లో దొంగలు పడితే పోలీస్ స్టేషన్‌కి కాదు గుడికి వెళ్తారు.. ఎందుకంటే..?
ఇంటికి తాళం వేసి ఊరెళ్లినా, లేదా బజారుకు వెళ్లినా తిరిగి వచ్చేవరకు ఇల్లు భద్రంగా ఉంటుందా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇటీవల దొంగలు పగలు, రాత్రీ అని లేకుండా చోరీలకు పాల్పడుతున్నారు. తాళం వేసిన ఇల్లు కనబడిందా తెల్లారేసరికి ఆ ఇల్లు గుల్లైపోతుంది.
నెల్లూరు జిల్లా అల్లూరు మండలం గాలి దిబ్బలు గ్రామంలో దొంగాలమ్మ ఆలయం ఉంది. దొంగలు పడ్డ బాధితులు ఈ ఆలయానికి వచ్చి మొక్కుకుంటే రోజుల వ్యవధిలోనే ఫలితం ఉంటుందని నమ్ముతారు. జిల్లా నుంచి కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు దొంగల బాధితులు వస్తుంటారు.ఇలా ఇక్కడకు వచ్చి వెళ్లిన వారికి ఎన్నో రోజులుగా దొరకని తమ సొత్తు తమకు దక్కిందని, అలా పోగొట్టుకున్న సొత్తు దొరకగానే మళ్లీ ఇక్కడకు వచ్చి మొక్కులు తీర్చుకుంటారని స్థానికులు చెబుతున్నారు. మొత్తానికి పోలీసులు విచారణ ఎలా ఉన్నా.. దొంగలబారినుండి తమను కాపాడేందుకు ఆ దొంగాలమ్మతల్లి అండ మెండుగా ఉందంటున్నారు స్థానికులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...