వెరైటీ దొంగ.. బంగారం, డబ్బు ఏదీ ఎత్తుకెళ్లడు కానీ

Updated on: Nov 05, 2025 | 5:11 PM

మీరు ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌ చేద్దామని హోటల్‌కు వెళ్తున్నారా? హోటల్‌లోకి వెళ్లేముందు చెప్పులు విడిచి వెళ్తున్నారా.. జాగ్రత్త! తిరిగి వచ్చేసరికి అవి ఉండొచ్చు..ఉండకపోవచ్చు. అవును హైదరాబాద్‌ పాతబస్తీలో ఇదే జరుగుతోంది. ఓ దొంగ... హోటళ్లకు వచ్చే కస్ట్‌మర్స్‌ను టార్గెట్‌గా చేసుకొని చెప్పుల చోరీకి పాల్పడుతున్నాడు.

భోజనం చేసి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించక కస్టమర్లు లబోదిబో మంటున్నారు. హోటల్‌ నిర్వాహకులకు ఇదో పెద్ద సమస్యగా మారింది. హైదరాబాద్‌ పాతబస్తీ ఎర్రకుంట ప్రాంతంలో గత కొంతకాలంగా ఈ విచిత్రమైన చోరీలు జరుగుతున్నాయి. రాత్రిపూట హోటళ్ల ముందు చెప్పులు ఉంచి లోపలికి వెళ్లే కస్టమర్లు తిరిగి బయటకు వచ్చేసరికి చెప్పులు కనిపించకపోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు. మొదట్లో దీనిని లైట్‌ తీసుకున్నా..తరువాత ప్రతి రోజు ఆ ఏరియాలోని ఏదో ఒక హోటల్‌లో ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో వ్యాపారులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ చెప్పులు పోగొట్టుకున్నకస్టమర్లు మళ్లీ .. తమ హోటళ్లకు రావటం లేదని గుర్తించిన హోటళ్ల యాజమాన్యాలు.. రాత్రి వేళల్లో హోటల్‌లకు వచ్చే కస్టమర్ల కదలికలను సీసీ ఫుటేజీల పరిశీలించారు. ఈ క్రమంలో డిన్నర్ కు వచ్చిన ఓ వ్యక్తి.. ముందుగా హోటల్‌ బయట వదిలిన చెప్పుల్లో మంచి బ్రాండెడ్‌ చెప్పులు చూసుకొని.. తర్వాత హోటల్‌కి వచ్చిన కస్టమర్‌లా వెళ్లి ఏదో ఆర్డర్‌ చెప్పి.. టక్కున బయటికొచ్చి.. తాను ముందుగా సెలెక్ట్‌ చేసుకున్న చెప్పలు వేసుకొని చక్కగా వెళ్లిపోవటం గుర్తించి.. చివరికి ఆ చెప్పుల దొంగను పట్టుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి చేతిలోని సంచీలో అనేక జతల చెప్పులుండటం చూసి హోటళ్ల యాజమానులు షాకయ్యారు. విచారణలో తెలిసింది ఏమిటంటే.. అతను రాత్రిపూట హోటళ్ల దగ్గర ఖరీదైన చెప్పులు, సాండల్స్ కొట్టేసి వాటిలో తన సైజువి వాడుకుని.. మిగిలిన వాటిని అమ్ముకుంటున్నాడట. మనోడు పాతబస్తీలోని హోటళ్లలోనే గాక.. సమీపంలోని పలు కాలనీల్లో ఇలా చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలులో బీభత్సం.. ప్రయాణికులపై కత్తితో దుండగుల దాడి

30 వేల అడుగుల ఎత్తులో విమానం ..ప్రయాణికుడికి గుండెపోటు.. ఏం జరిగిందంటే

Telangana: సిరిసిల్ల జిల్లా కుర్రాడికి, ఫ్రాన్స్‌ అమ్మాయికి పెళ్లి

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు అలర్ట్‌

కడుపు నింపని పురస్కారాలు నాకెందుకు.. ఓ రచయిత ఆవేదన