బైకుపై కూర్చున్న వ్యక్తి.. సడన్‌గా వచ్చిన పాము.. ఆ తర్వాత..?
ప్రమాదం ఎప్పుడు ఎవర్ని ఎలా వెంటాడుతుందో తెలియదు. రోడ్డు ప్రమాదాలు, జంతువుల దాడి, పాముకాట్లు ఏ రూపంలోనైనా ప్రమాదం బారినపడొచ్చు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ బండ్లగూడలో జరిగింది. బైక్ పై కూర్చున్న వ్యక్తిని పాము కాటు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా పాము కనబడితే ఆమడ దూరం పారిపోతాం.
అలాంటిది పాము మన పక్కనే ఉంది లేదంటే మనం కూర్చున్న సీటు కిందే ఉందంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఓసారి ఊహించుకోండి. భయంతో ఒళ్ళు జలదరిస్తుంది కదూ. సరే ఇక అలాంటి ఘటనే హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బండ్లగూడ పరిధి క్రిస్టల్ టౌన్ లో పాముకాటు ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బయటకు వెళదామని బైక్ పై కూర్చున్న వ్యక్తిని బైక్ కిందగా వచ్చిన ఒక పాము కాటు వేసింది. వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. సకాలంలో స్థానికులు గుర్తించి బాధితుడిని ఆసుపత్రికి తరలించడంతో అతను సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ వ్యక్తిని కాటు వేసిన పామును కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అది విషపూరితమా కాదా అని తెలుసుకునేందుకు ఆసుపత్రికి తీసుకెళ్ళమని స్థానికులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయింది. ఆ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. వర్షాకాలం కావడంతో పాములు ఎక్కడ పడితే అక్కడ తిష్ట వేస్తున్నాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బొంగులో చికెన్ కాదు.. వెదురు బొంగుల కూర తింటే వదిలిపెట్టరు
చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఈ కూరగాయలోనే
Sweet Potato: చిలకడ దుంప.. చేసే మేలు ఎంతో
పాములతో ఆటలా? నదిలోకి దూకి పాముల వెలికితీత.. ఎక్కడంటే..
సన్నటి నడుము కోసం పక్కటెముకలు తొలగింపు.. డాక్టర్లు వారిస్తున్నా మొండిగా ముందుకే