ఆనందంగా పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న జంట.. అంతలోనే..

Updated on: Apr 09, 2025 | 7:12 PM

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ జంట తన 25వ వివాహ వేడుకను ఘనంగా జరుపుకొంది. ఈ సందర్భంగా దంపతులిద్దరూ స్టేజిపై డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో భర్త డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి అతిథులు సహా అందరూ షాకయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

బరేలీకి చెందిన షూ వ్యాపారి వాసిమ్‌ సర్వాత్‌ తన 25వ పెళ్లిరోజు సందర్భంగా సిల్వర్‌ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. వాసిమ్‌ సర్వాత్‌ వయసు యాభై ఏళ్లు. అతని భార్య ఫరా స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో వాసిమ్‌ దంపతులు ఆనందంగా వివాహ వేడుకలు జరుగుతుండగా.. వాసిమ్‌ దంపతులు కలిసి ఆనందంగా డాన్స్‌ చేశారు. ఈక్రమంలో డాన్స్‌ చేస్తూనే ఒక్కసారిగా వాసిమ్‌ కుప్పకూలిపోయారు. వెంటనే అలర్టయిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే వాసిమ్‌ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ ఇంట విషాదం నిండిపోయింది. ఇది గుర్తించలేని హార్ట్ ఎటాక్ అని సీనియర్ కార్డియాలజిస్ట్ ఒకరు తెలిపారు. రక్త ప్రసరణలో సమస్యలు కానీ, గుండె లయలో సమస్యలు కానీ అంతర్లీనంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు జరుగుతుంటాయని తెలిపారు. కాబట్టి ఊపిరి తీసుకోవడంలో సమస్యలు కానీ, గుండె లయ అసంబద్ధంగా ఉన్నప్పుడు కానీ వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుడ్డి చిన్నదే.. కానీ లాభాలు అధికం! ఎన్టీఆర్ తాగిన ఆ డ్రింగ్‌ ఏంటంటే?

Mark Shankar Pawanovich: పవన్ చిన్న కొడుకు.. హెల్త్ బులెటిన్ విడుదల

వంటలక్కకు కోట్లకు కోట్లే..! దిమ్మతిరిగే రెమ్యునరేషన్‌

బలుపు ఎక్కువై.. నోటి దూలతో…! అలేఖ్య చిట్టిపై అన్వేష్ వీడియో..

BSNL యూజర్లకు గుడ్‌న్యూస్‌.. రూ.251తో సూపర్‌ ప్లాన్‌