భార్యపై భర్త ఫిర్యాదు.. కారణం తెలిసి షాకైన పోలీసులు !!
కర్ణాటక పోలీసులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో షాక్ అయ్యారు పోలీసులు. ఇంట్లోని బంగారం కాజేసి, పైగా వేధింపులకు గురిచేస్తోందని భార్యపై భర్త పోలీసులను ఆశ్రయించాడు.
కర్ణాటక పోలీసులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో షాక్ అయ్యారు పోలీసులు. ఇంట్లోని బంగారం కాజేసి, పైగా వేధింపులకు గురిచేస్తోందని భార్యపై భర్త పోలీసులను ఆశ్రయించాడు. మైసూరు వివి పురం పరిధిలోని విజయనగరలో ఎం.రఘు కారియప్ప, భార్య జాస్మిన్‌తో నివసిస్తున్నాడు. జాస్మిన్ టీచర్‌గా పనిచేస్తుంది. జాస్మిన్ గత ఐదేళ్లుగా తనను వేధిస్తోందని, అనేకసార్లు హత్యాయత్నం చేసిందని రఘు కారియప్ప పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన 6 బంగారు ఉంగరాలు, 2 బంగారు నాణేలు, ఒక చైన్, ఒక పెద్ద గాజును తన భార్య దొంగిలించిందన్నాడు. తీసుకున్న నగలు తిరిగి అడిగితే ఇవ్వడం లేదని తెలిపాడు. తన వస్తువులను ఇప్పించాలని పోలీసులను కోరగా వారు పట్టించుకోలేదు. దీంతో కోర్టులో అర్జీ వేయగా, కేసు నమోదు చేసి విచారించాలని పోలీసులను జడ్జి ఆదేశించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: