వింత చేప.. సగం పాము.. సగం డైనోసార్‌లా..
సముద్రంలో ఎన్నోరకాల వింత జీవులు ఉంటాయి. తాజాగా అరుదైన చేప ఒకటి నెటిజన్లను భయపెడుతోంది. వింత ఆకారంలో భయంకరంగా ఉన్న చేపను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
సముద్రంలో ఎన్నోరకాల వింత జీవులు ఉంటాయి. తాజాగా అరుదైన చేప ఒకటి నెటిజన్లను భయపెడుతోంది. వింత ఆకారంలో భయంకరంగా ఉన్న చేపను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో సముద్రంలో ఓ చేప హాయిగా ఈదుతూ ఉంది. అది చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. దాని తలభాగం చూస్తే డైనోసార్‌లా ఉంది. ఇక మిగతా భాగం చూస్తే పాములా ఉంది. ఇది ఫ్రిల్డ్ షార్క్ జాతికి చెందిన చేపగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది 80 మిలియన్ సంవత్సరాల నుండి భూమిపై ఉందని చెబుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ఇంత కాలం ఈ జీవి ఎలా బతుకుతుంది అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిని దెయ్యం షార్క్ అని పిలుస్తారట. కాగా ఈ వీడియో 2007 నాటిది కాగా ఇప్పుడు ఈ వీడియో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ సమయంలో అది జపాన్‌లోని అవాషిమా మెరైన్ పార్క్‌లో తీసినట్టుగా తెలిసింది. డైనోసార్ల యుగం నుండి అంటే 80 మిలియన్ సంవత్సరాల నుండి ఈ జాతి ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.