Husband – Lady SI: కారు అద్దం పగులగొట్టిందని.. మ‌హిళా ఎస్ఐని చిత‌క‌బాదిన భ‌ర్త..! వీడియో వైరల్..

|

Dec 20, 2022 | 9:49 AM

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యపై నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించాడు. ఢిల్లీకి చెందిన ఓ మ‌హిళా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ని భ‌ర్త చిత‌క‌బాదాడు.


దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి భార్యపై నిర్ధాక్షిణ్యంగా ప్రవర్తించాడు. ఢిల్లీకి చెందిన ఓ మ‌హిళా స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ని భ‌ర్త చిత‌క‌బాదాడు. అనంత‌రం ఆమె త‌ల్లిపై కూడా దాడి చేయ‌బోయాడు. ఈ దృశ్యాలు ఎస్ఐ ఇంటి వ‌ద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ద్వారకాకు చెందిన దోలి తేవాతియా వృత్తిరీత్యా స‌బ్ ఇన్‌స్పెక్టర్. ఆమెకు అడ్వకేట్ త‌రుణ్ ద‌బాస్‌తో కొన్నేండ్ల క్రితం వివాహం జ‌రిగింది. అయితే ఎస్ఐ దోలి ప్రస్తుతం మెట‌ర్నిటీ లీవ్‌లో ఉంది. త‌న త‌ల్లిగారింట్లో ఉన్న దోలికి.. భ‌ర్తతో గ‌త కొద్ది రోజుల నుంచి గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్రమంలోనే భ‌ర్త త‌రుణ్ దోలి ఆమె దగ్గరకు వ‌చ్చాడు. ఈ క్రమంలో ఇరువురి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. భ‌ర్త కారులో తిరిగి వెళ్తున్న స‌మ‌యంలో దోలి స‌హ‌నం కోల్పోయి కారు మిర్రర్‌ను విర‌గ్గొట్టింది. దీంతో భ‌ర్త కారు దిగి దోలిని కింద ప‌డేశాడు. అడ్డుకోబోయిన దోలి త‌ల్లిపై కూడా అత‌ను దాడి చేసేందుకు ప్రయ‌త్నించాడు. ఈ దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కాగా, తనపై దాడికి పాల్పడ్డ భర్త తరుణ్‌పై చర్యలు తీసుకోవాలని దోలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Partners Relationship: సంసారంలో స్మార్ట్‌గా చిచ్చు.. ఇలాగైతే మొదటికే మోసం..! వైవాహిక జీవితం బాగుండాలి అంటే..

Shocking Video: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా గూడె కట్టేశాయి.. చెవి స్కానింగ్‌లో బయటపడ్డ షాకింగ్ సీన్..

Murder: దారుణం.. అప్పు ఇచ్చిన పాపానికి గొంతు, నరాలు కోసి హత్య చేసారు.! పోలీసులు ఏమ్మన్నారు అంటే..

 

Published on: Dec 20, 2022 09:49 AM