Tirumala Tirupati: తిరుమల వెళ్లేవారికి అలెర్ట్..! శ్రీవారి దర్శనానికి 30 నుంచి 40 గంటల సమయం..!
మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. వీలైతే ప్రయాణం వాయిదా వేసుకోండి. లేదంటే కొండపై ఎండలో మాడిపోవాల్సిందే.. కిక్కిరిసిపోయిన క్యూలైన్లలో పిల్లా పెద్దలతో ఆపసోపాలు పడాల్సిందే.
మీరు తిరుమల వెళ్తున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించుకోండి. వీలైతే ప్రయాణం వాయిదా వేసుకోండి. లేదంటే కొండపై ఎండలో మాడిపోవాల్సిందే.. కిక్కిరిసిపోయిన క్యూలైన్లలో పిల్లా పెద్దలతో ఆపసోపాలు పడాల్సిందే. ఎందుకంటే రోజుకి 80వేలకు మించి భక్తులు తిరుమల కొండపైకి వెళ్తున్నారు. దీంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఊహించని స్థాయిలో భక్తులు పోటెత్తడంతో దిద్దుబాటు చర్యలకు దిగింది టీటీడీ. తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ కారణంగా తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 40 గంటలకు మించి సమయం పడుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితిని నియంత్రించేందుకు.. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంది. జూన్ 30 వరకు స్వామివారి ఆర్జిత సేవలు.. వీఐపీ దర్శనాల్లో మార్పులు చేసింది. వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.