Python Viral Video: వామ్మో.. ఇంత పెద్ద పైథాన్‌ను జీవితంలో చూసుండరు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..

Python Viral Video: వామ్మో.. ఇంత పెద్ద పైథాన్‌ను జీవితంలో చూసుండరు.. ఒళ్ళు గగుర్పొడిచే వీడియో..

Anil kumar poka

|

Updated on: Jul 15, 2022 | 9:26 PM

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యకరంగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా ఓ భయంకరమైన పైథాన్ వీడియో వైరల్ అవుతోంది.


సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వైరల్ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యకరంగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా ఓ భయంకరమైన పైథాన్ వీడియో వైరల్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్లంతా షాక్ అవుతున్నారు. ఇలాంటి భారీ కొండ చిలువను ఇప్పటివరకు చూడలేదని.. ఇది చూస్తుంటే.. ఒళ్లు జలదరిస్తుందంటున్నారు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్సుశాంత నంద షేర్ చేశారు. బయటి గోడ నుంచి ఇంట్లోకి వెళుతున్న కొండచిలువ క్లోజ్-అప్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. తాను చాలా ఫోటోలు, వీడియోలు చూశాను.. కానీ ఇది నాకు షాక్ ఇచ్చిన సన్నివేశం అంటూ IFS అధికారి అభిప్రాయపడ్డారు.ఈ వైరల్ వీడియోలో కొండచిలువ ఓ ఇంట్లోకి ప్రవేశించేందుకు వెళ్తోంది. అక్కడ మోటార్ సైకిల్, సైకిల్ పార్క్ చేసి ఉన్నాయి. ప్రధాన ద్వారం వెలుపల నీటి బాటిల్ కూడా ఉంది. ఈ షాకింగ్‌ వీడియోను వేలాదిమంది వీక్షిస్తున్నారు. లైక్స్‌తో, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇంతకీ ఈ కొండ చిలువ పరిమాణం, ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది క్లారిటీ లేదు. కానీ ట్విట్టర్ వినియోగదారులు భారీ అనకొండను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది కొండచిలువ కాదు, బహుశా అనకొండ కావచ్చు అంటున్నారు. మరి కొంతమంది దీనిని రెటిక్యులేట్ పైథాన్ అంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Sugarcane Plantation: పైకి చెరకు తోటే.. లోపల యవ్వారం మాములుగా లేదుగా.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్…

Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్‌ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!

Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?

Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..

Published on: Jul 15, 2022 09:26 PM