CM Shivraj Singh Chouhan: ముఖ్యమంత్రికి చల్లని టీ ఇచ్చిన అధికారికి షోకాజ్ నోటీసులు..
ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అలాంటి వ్యక్తికి చల్లని చాయ్ అందించారు అక్కడి అధికారులు. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అలాంటి వ్యక్తికి చల్లని చాయ్ అందించారు అక్కడి అధికారులు. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ వ్యవహారాలను చూసుకున్న ఓ అధికారికి షోకాజ్ నోటిసులు అందించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజకీయ ప్రముఖులకు చల్లని టీ అందించిన వ్యవహారంలో.. సరైన వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు జూనియర్ సప్లై అధికారిని హెచ్చరించారు. ముఖ్యమంత్రికి అందించిన టీ నాసిరకంగా ఉందని, పైగా అది చల్లగా అయిపోయిందని తెలిపారు. ఈ మేరకు ఛాతర్‌పూర్ జిల్లా రాజ్‌నగర్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ డీపీ ద్వివేది.. జూనియర్ సప్లై ఆఫీసర్ రాకేశ్ కాన్హౌ ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం జూలై 11న ఖజురహో ఎయిర్‌పోర్ట్‌లో కాసేపు ఆగారు. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్ వీఐపీలాంజ్‌లో సీఎంతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు వేచిఉన్నారు. ఈ సమయంలో అధికారులు వారికి టిఫిన్‌తో పాటు టీ అందించారు. అయితే సీఎం, రాజకీయ నాయకులకు అందించిన టీ చల్లారిపోయి ఉండడంతో వాళ్లంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జూనియర్ సప్లై ఆఫీసర్‌కు షోకాజ్ నోటీసులు పంపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే..ఈ 5 స్కిల్స్ తప్పనిసరి..!
గ్యాస్ అక్కర్లేదు.. కిరోసిన్, నీటితో నడిచే స్టవ్ వచ్చేసింది
బోను నుంచి తప్పించుకున్న చిరుత.. ఆ తర్వాత సీన్ చూస్తే..
సముద్ర గర్భంలో భారీగా బంగారం, వెండి..వేట మొదలు పెట్టిన చైనా
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!

