Gold Seizure: భారీగా పట్టుబడుతున్న బంగారం, వెండి.! ఎన్నికల నేపథ్యంలో రూల్స్ బ్రేక్.

|

Apr 15, 2024 | 11:32 AM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అడుగడుగునా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం, మద్యం తరలింపు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సరైన పత్రాలు చూపని నగదు, బంగారాన్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. అడుగడుగునా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, బంగారం, మద్యం తరలింపు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. సరైన పత్రాలు చూపని నగదు, బంగారాన్ని పోలీసులు సీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం పొట్టిలంక చెక్పోస్ట్ వద్ద పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఓ కంటైనర్‌లో సుమారు కోటి రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలు రవాణా చేస్తుండగా పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చామని సౌత్‌జోన్‌ డీఎస్పీ అంబికా ప్రసాద్‌ తెలిపారు. పట్టుబడిన బంగారం, వెండికి సంబంధించి కొన్ని పత్రాలు చూపించారని, డిస్టిక్ గ్రీవెన్స్ కమిటీ విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..