అదే పనిగా అరుస్తున్న కుక్కలు.. ఏంటా అని వెళ్లి చూడగా

|

Aug 09, 2024 | 2:06 PM

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడటంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో వన్యప్రాణులు ఆవాసం కోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజగా ఓ ఇంట్లోకి భారీ మొసలి ఒకటి వచ్చేసింది. తెల్లవారుజామున ఎప్పుడూ లేనిది ఇంటి ముందు కుక్కలు అదే పనిగా అరుస్తుంటే ఆ ఇంటి యజమానికి అనుమానం వచ్చి బయటకు వచ్చి అంతా పరికించి చూశాడు. బాత్రూమ్‌ పక్కన ఓ భారీ ఆకారం కనిపించింది.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడటంతో అనేక ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో వన్యప్రాణులు ఆవాసం కోసం జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజగా ఓ ఇంట్లోకి భారీ మొసలి ఒకటి వచ్చేసింది. తెల్లవారుజామున ఎప్పుడూ లేనిది ఇంటి ముందు కుక్కలు అదే పనిగా అరుస్తుంటే ఆ ఇంటి యజమానికి అనుమానం వచ్చి బయటకు వచ్చి అంతా పరికించి చూశాడు. బాత్రూమ్‌ పక్కన ఓ భారీ ఆకారం కనిపించింది. దానిని చూడగానే గుండె ఆగినంత పనయ్యింది. ఒక్కసారిగా అరుపులు, కేకలతో ఇంట్లోకి పరిగెత్తాడు ఆ వ్యక్తి. చుట్టుపక్కల వాళ్లకు కేకలేసి విషయం చెప్పారు. అంతా అక్కడికి పరుగెత్తుకొచ్చారు. అక్కడ కనిపించిన భారీ మొసలిని చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏకంగా 8 నుంచి 10 అడుగుల పొడవున్న ఆ భారీ మొసలిని చూసి అంతా షాకయ్యారు. ఈ ఘటన.. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం జానంపేట గ్రామంలో వెలుగుచూసింది. బాత్రూం సమీపంలో… మొసలిని చూసిన ఆ ఇంటి వ్యక్తి.. ఏం చేయాలో తెలియక పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు.. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, స్నేక్ సొసైటీ వారికి సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి చేరకున్న అటవీ శాఖ సిబ్బంది.. ఆ మొసలిని తాళ్లతో బంధించారు. అనంతరం.. గ్రామానికి సమీపంలోనే ఉన్న కృష్ణా నదిలో దాన్ని వదిలిపెట్టారు. ఈ సందర్భంగా.. అటవీశాఖ అధికారిణి రాణి మాట్లాడుతూ.. భారీ వర్షాలు, వరదలకు గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి పొలాల్లోకి వచ్చిన మొసలి.. దారి తప్పి ఇలా జనావాసాల్లోకి వచ్చి ఉంటుందని చెప్పారు. ఇలాంటి వన్యప్రాణులు కనిపిస్తే.. వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రైన్‌లో నిద్రలో ఉండగా చెయ్యేశాడు.. చెంప ఛెళ్లు మనిపించింది

నేను దేశ గురువును.. మీ ఊరికి కీడు సోకింది.. అందుకే వచ్చా

Prabhas: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం

రూ.10 కాయిన్‌ చెల్లదంటే చెరసాలే !! కఠిన చర్యలు తప్పవంటూ ఆర్బీఐ హెచ్చరికలు

చలియార్ నదిలో కొట్టుకొస్తున్న మానవ అవయవాలు