Raikal waterfalls: కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
చుట్టు పచ్చని వాతవరణం. ఎత్తు నుండి పాలపొంగులా జాలువారుతున్న నీటి సోయగం. ఇదీ కరీంనగర్ జిల్లా రాయకల్ జలపాత అందం. గత వారంరోజుల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముసురుగా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు పర్యటక కేంద్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా జిల్లాలోని సైదాపూర్ మండలం రాయకల్ గ్రామానికి జనం క్యూ కడుతున్నారు. కార్లు.. టూ వీలర్లు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని ఈ గ్రామం వైపు వచ్చేస్తున్నారు.
ముసురుగా కురుస్తున్న వర్షం.. చల్లని పిల్లగాలుల పలకరింపు.. ఇలాంటి సమయంలో వర్షంలో తడవాలనో.. జలపాతలకు పరుగులు పెట్టాలనో ఎవరికి అనిపించదు చెప్పండి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలే కనపడుతున్నాయి.. వర్షానికి జాలువారుతున్న జలపాతలకు జనం క్యూ కడుతున్నారు.
చుట్టు పచ్చని వాతవరణం. ఎత్తు నుండి పాలపొంగులా జాలువారుతున్న నీటి సోయగం. ఇదీ కరీంనగర్ జిల్లా రాయకల్ జలపాత అందం. గత వారంరోజుల నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముసురుగా వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు పర్యటక కేంద్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా జిల్లాలోని సైదాపూర్ మండలం రాయకల్ గ్రామానికి జనం క్యూ కడుతున్నారు. కార్లు.. టూ వీలర్లు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని ఈ గ్రామం వైపు వచ్చేస్తున్నారు. చుట్టు గొలసు గుట్టలు.. వాటిపై పచ్చని చెట్లు.. చిన్నచిన్నగా కురుస్తున్న వర్షం మద్య ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదంగా మారింది. దీంతో వర్క్ స్ట్రెస్ తీర్చుకునేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.. కేవలం యూతే కాకుండా ఫ్యామీలితో సహా వచ్చే వారి సంఖ్య ఇక్కడి భారీగా కనపడుతోంది.
రాయకల్ గ్రామ శివారులో ఉన్న గొలుసు గుట్టల పై నుండి జాలువారుతుంది ఈ జలపాతం..కింది నుండి గుట్టపైకి ట్రెక్కింగ్ చేస్తు అడ్వెంచర్ ఫీల్ ని ఎంజాయి చేస్తున్నారు.. బండరాళ్లు ఎక్కుతూ.. పై నుండి పడుతున్న నీటి సవ్వడి వింటూ ఈ ఆడవిలో థ్రిల్ అయ్యేందుకు ఇతర ప్రాంతాల నుండి కూడా చేరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా.. వరంగల్, హైదరబాద్ నుండి కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.. ఇతర రాష్ట్రాల నుండి ఉపాది నిమిత్తం కరీంనగర్ .,వరంగల్ వచ్చిన వారు ఈ జలపాతం అందానికి ముగ్దులుగా మారిపోతున్నారు. అయితే ఇంత పెద్దఎత్తున వాహానాల్లో రాయకల్ జలపాతానికి పర్యటకులు వస్తున్నప్పటికి కనీసం రోడ్డు మార్గం కూడా సరిగా ఉండకపోవడంతో పర్యటకులు అవస్దలు పడుతున్నారు.. ఇక ఇక్కడికి వచ్చే మహిళలకు. యువతులకు భద్రత కూడా అంతగా కనపించకపోవడం ఓ మైనస్. దీంతో పాటుగా.,జలపాతం సమీపంలో బహిరంగ మద్యపానం సేవిస్తున్న వారూ కనపడుతూండటంతో కుటుంబాలతో వస్తున్న పర్యటకులకు ఇబ్బందిగా మారిపోయింది. సరైన రోడ్డు. కాస్త భద్రత కల్పిస్తే రాయకల్ జలపాతం ప్రతి వర్షకాలంలో ఓ మంచి పర్యటక కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. దీని వల్ల స్దానికులకు ఓ ఉపాది మార్గంగా కూడా మారుతుంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రాంత అభివ్రద్దిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ద్రుష్టి పెట్టాలని కోరుకుంటున్నారు స్దానికులు. జలపాతలు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నామని పర్యాటకులు అంటున్నారు. ఇలాంటి దృశ్యాలు ఎప్పుడు చూడలేదని. రోజంతా ఇక్కడే గడుపుమని చెబుతున్నారు.. ఇక్కడ రోడ్డు మార్గం ఉంటే బాగుండేదని చెబుతున్నారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.