జంతువులు రెండు కాళ్లతో నడిస్తే ఇలా ఉంటుందా..

Updated on: Feb 21, 2025 | 5:54 PM

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యత పెరుగుతోంది.. అన్నింటిలోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఎంట్రీ ఇస్తోంది. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే ఏఐ. యస్‌.. ఇప్పుడంతా ఏఐ యుగం. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. ఏఐ.. ఏఐ.. ఏఐ. ఇప్పుడు ఇది సర్వాంతర్యామి అయిపోయింది. ఏఐ ద్వారా వింతలు వినోదాలు సృష్టిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇదో కనికట్టు విద్య. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్లు చూపించడమే ఈ టెక్నాలజీ స్పెషల్‌.

20 ఏళ్ల వయసు వారిని 80 ఏళ్ల వృద్ధులుగా, క్రికెటర్లను పండ్లు అమ్ముకునే వాళ్లుగా, బిలియనీర్లను మురికివాడల్లో నివసించేవాళ్లుగా.. ఇలా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా సృష్టించిన సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు. అలాంటి వీడియోనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అయితే ఈసారి జంతువులు, పక్షులు మనుషుల్లా నడిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు. ఓ బీచ్‌ వద్ద ఆవు, ఏనుగు, సింహం, జిరాఫీ, జీబ్రా, పాము, ఖడ్గమృగం వంటి జంతువులు రెండు కాళ్లతో నడుస్తున్నట్లు వీడియోని సృష్టించారు. ప్రస్తుతం ఈ ఏఐ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆశ్చర్యకరమైన ఈ వీడియోపై నెటిజన్స్‌ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క హగ్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. కేవలం 20 సెకన్లలో