Honeytrap: నమ్మించి ఇంటికి పిలిచి.. మాట్లాడదామంటూ గదిలోకి తీసుకెళ్లి.. వీడియో తీయించి..!(వీడియో)
సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను మాయలోకి దించి డబ్బులు దండుకుంటోంది ఓ ముఠా. పేరున్న వారిని ఎంపిక చేసుకొని వలపు ఉచ్చులో లాగి.. లక్షల వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను జమ్మూకశ్మీర్ పోలీసులు
సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను మాయలోకి దించి డబ్బులు దండుకుంటోంది ఓ ముఠా. పేరున్న వారిని ఎంపిక చేసుకొని వలపు ఉచ్చులో లాగి.. లక్షల వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను జమ్మూకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆర్నెల్లలో ఈ ముఠా 40 లక్షల రూపాయల దాకా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసు తెలిపారు. 8 లక్షలు ఇవ్వకపోతే రహస్యంగా తీసిన వీడియో బయటపెడతామని ఓ ముఠా బెదిరిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పక్కా స్కెచ్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. భార్యాభర్తలైన శాయిస్తా బషీర్, ఐజాజ్ అహ్మద్ గనీలతోపాటు జహంగీర్ అహ్మద్ దార్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఆపదలో ఉన్నట్లు శాయిస్తా చేసిన ఫోనుతో వారి ఇంటికి వెళ్లిన అధికారిని మాట్లాడే మిషతో ఆమె పడకగదిలోకి తీసుకువెళ్లింది. లోనికి చొరబడిన ఐజాజ్, జహంగీర్.. ఆ ఇద్దరినీ కలిపి వీడియో తీశారు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోను వైరల్ చేస్తామని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

