Boy Kidnap: బాలుడి ‘కిడ్నాప్’.. రూ.15 లక్షలు తీసుకుని ఆ పై తండ్రి కారులోనే..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
రమేశ్ బాబు అనే ధనవంతుడి కుమారుడిని ఇద్దరు స్నేహితులు కలిసి సెప్టెంబర్ 2న కిడ్నాప్ చేశారు. రమేశ్ బాబు కొడుకు భవేశ్ తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడని ముందుగానే తెలుసుకుని..
కాలేజీ ఫీజు కట్టేందుకు డబ్బులు లేవని ఓ డిగ్రీ విద్యార్థి ఏకంగా కిడ్నాప్ చేశాడు. ఓ ధనవంతుడి కుమారుడిని కిడ్నాప్ చేసి 15 లక్షల రూపాయలు తీసుకున్నాడు. వాటితో కాలేజీ ఫీజు కట్టి ఓ బైక్, డిజిటల్ కెమేరా కొనుగోలు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఈ కేసులో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు తీసుకున్న బికాం విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు 23 ఏళ్ల ఎం సునీల్ కుమార్‌గా గుర్తించారు. అలాగే.. నిందితుడి స్నేహితుడు, మండికల్‌కు చెందిన వైవీ నగేశ్‌ని సైతం అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రమేశ్ బాబు అనే ధనవంతుడి కుమారుడిని ఇద్దరు స్నేహితులు కలిసి సెప్టెంబర్ 2న కిడ్నాప్ చేశారు. రమేశ్ బాబు కొడుకు భవేశ్ తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడని ముందుగానే తెలుసుకుని.. అక్కడికి వెళ్లారు నిందితులు. కత్తి చూపించి బాలుడిని తండ్రి కారులోనే కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకోసం భవేశ్ తండ్రి మొబైల్ ఫోన్‌నే ఉపయోగించటం గమనార్హం. డబ్బులు ఇచ్చేందుకు రమేశ్ బాబు అంగీకరించటంతో.. రైల్వే ట్రాక్ సమీపంలో నగదు తీసుకుని బాలుడిని విడిచిపెట్టారు. ఆ తర్వాత ఈ సంఘటనపై రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

