Government schoo: మిడ్‌డే మీల్‌లో దారుణం.! పిల్లలకు కేవలం ‘సాల్ట్ రైస్’ మాత్రమే.. ప్రభుత్వ స్కూల్ తీరు మండిపడుతున్న జనం..
ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో
ఒక ప్రభుత్వ స్కూల్‌లో విద్యార్థులకు మిడ్ డే మీల్‌లో సరైన భోజనం అందించకుండా నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించడంతో ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.అయితే ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని విద్యార్థుల తల్లిదండ్రుల తీసి యోగి సార్ ఇలాంటి పాఠశాలకు ఎవరైనా తమ పిల్లలను పంపించగలరా అని ప్రశ్నించారు.యోగి జీ.. మీరైనా పట్టించుకోండి అని విద్యార్థి తల్లిదండ్రులు అభ్యర్థించారు. వాస్తవానికి ఆ స్కూల్ గోడలపై ఉన్న మిడ్ డే మెనులో పాలు, రోటీలు, పప్పు, కూరగాయలు, బియ్యం లిస్ట్ ఉంది. కానీ ఆ పాఠశాల్లో మాత్రం ఉప్పుతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్ నితిష్‌కుమార్ స్పందించి…మెనులో ఉన్న ప్రకారమే భోజనం అందించమనే ఆదేశించాం. ఇలాంటి విషయాల్లో నిర్లక్ష్య వైఖరిని సహించేదే లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

